అయోధ్యలో ధర్మానికి ప్రతిరూపమైన
మానవాళికే ఆదర్శమైన శ్రీరామచంద్రుని
అనేక అవాంతరాల తరువాత
ప్రతిష్టాత్మక అంశంగా తీసుకుని
భారతదేశ ఔన్నత్యాన్ని వసుదైకానికే ఆదర్శంగా నిలిపి
హిందూ ధర్మ పరిరక్షణను కాపాడి
ఆరువందల సంవత్సరాల పోరాటాన్ని
ఆదరక,బెదరక బాలరాముని ప్రతిష్టచేసి
హిందూ బంధవుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన
ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ
అయోధ్య ఆలయగోపురంపై
కాషాయ ధ్వజాన్ని ఏడు పదులు దాటిన వయస్సులో
వినీల గగనాన భక్తి శ్రద్ధలతో ఎగురవేసిన సందర్భంగా
ఓ హిందువా గర్వంగా తలఎత్తి
మేరా భారత్ మాహాన్ అని ఎలుగెత్తి చాటు
వందేమాతరం భారతమాతకి జై...!!
........................
హిందువుగా గర్వించే రోజు:- కవిమిత్ర సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-విశాఖపట్నం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి