*****
"అవ్వా! అవ్వా! ఏం జేయాల్నో అస్సలు సమజైతలే. బువ్వ మీద కుతి లేత్తుందే బుజ్జీ! గంత చింతకాయ తొక్కేసి వొత్తుగ కల్పి పెట్టమని ఈడ్గిల బడుకుంట ఒక్క తీర్గ అడుగుతుండు. డాటరేమో " బువ్వ అర్గదు.అజీర్తి జేత్తది.అంబలన్న,జావన్న బోయుండ్రి. ఇరేచనాలు బట్కుకుంటే ముస్లాయన దక్కడం కట్టమని జెప్పిండు.ఏం జేయాల్నో కాల్జేతులు ఆడట్లే అవ్వా!
మొన్న మొన్నటి దనుక గా సుగరు బీమారితో దవాఖాన్లనే ఉండు! మందు గోళీలు ఏస్కుంటనే ఉండు గా సుగరు ఒంట్లె నించి అస్సలికి తగ్గుతలే. గీనేమో మూన్నాలుగు దినాల సంది గిట్ల జేస్తుండు.గా బువ్వ దిని ఏం గాకుండ ఎన్ని ఇంజీషన్లైన పొడిపిచ్చుకుంటనే అంటుండవ్వా !
గదేనే బుజ్జీ!బుద్దెరిగిన సంది బువ్వ దిని పెరిగిన పానమాయె.గిన్ని దినాలు బువ్వకి దూరమయ్యే తలికి గట్ల కుతి లేత్తుందేమోనే. నాకు సుత గట్లనే జొరమొచ్చి ఒకట్రెండు దినాలు బువ్వ దినకుండ డాటర్ జెప్పినట్టు డబల్ రొట్టె,బన్ను ముక్క తింటనా! ఇంగెప్పుడు బువ్వ దినాలె.ఇంగెప్పుడు బువ్వ తినాలె అన్న ద్యాసే.గీ బువ్వ దినకుండనె జీవిడిత్తనేమో అనిపించేదే బుజ్జీ! గట్లనే మీ తాతకి సుత అనిపిత్తుందేమోనే.వొయసు మీద బడినోళ్ళకి పసిపొల్లగాండ్ల లెక్క ఏదేదో తినాలపిత్తదట.నా చిన్నతనాన మా జేజి నోరిడిసి పెద్దోళ్ళనడగలేక నన్ను దెగ్గర కూసుండ బెట్కొని జెప్పేది.
"గదే గాదవ్వా!మా తాత దెగ్గర కూసుంటే ఇంగ పొద్దూకులు వాళ్ళవ్వ ముచ్చటే.సిన్నతనాన అవ్వ పేమ.పెద్దయినంక అవ్వ జేసిన కట్టం. తన్నెట్ల కండ్లల్ల బెట్టుకొని సాదుకుంది జెప్పుకుంట గదే మా యవ్వుంటే గిట్ల నోర్దెరిసి అడక్కముందలే పెట్టేదంటడు. గట్ల పసిపోరని లెక్క అనేతల్కి మన్సంత కలికలి అయిద్దవ్వా!
"అవునే బుజ్జీ! గందుకే మన పెద్దోళ్ళు"అవ్వ మీద యాష్ట రాదు - బువ్వ మీద బుద్ధి తీరది అంటరు". అవ్వ అవ్వేనే. అవ్వ పేమ, కష్టం దెల్సినోళ్ళకి అవ్వ ముచ్చట ఎంత జెప్పుకున్నా యాష్టకి రాదు. గంద్కనే దేవుళ్ళల్ల అవ్వనే మొదలన్నరు. ఇంగ బువ్వంటవా? బువ్వ తినకుండా ఉండలేని పానాలు. మాడ్సిన కారమైనా, నీళ్ళ సల్లైనా బుక్కెడు బువ్వల ఉప్పుగల్లు ఏసుకొని దిన్నా బుద్ధి తీరది. మల్ల మల్ల దినాలనిపిత్తది.మడిసి బతుకును అవ్వ- బువ్వ నుంచి యిడదీయలేమే బుజ్జీ! గంద్కనే ఒక్కటే ఒక్క ముద్ద తాత అడ్గినట్టు బెట్టు.ఆనెక్క సల్ల తాపియ్యడం మర్వకు".
గట్లనే అవ్వా! నువ్వు గివన్ని జెప్తుంటె నాకు సుత మా అవ్వనొక్కపాలి సూడబుద్ధైతంది. వత్త మల్ల. నివుసం లేక పోతే తాత అల్లడం తల్లడం అయితడు." అన్కుంట బోతున్న బుజ్జిని జూస్కుంట "అమ్మ నాయినతో నేను సుత మాట్లాడక చాన్నాల్లయింది. మా ఆయన్ని సెల్లుల నెంబరు గలిపియ్యమని జెప్పాలె " అన్కుంట లోపల్కి బోయింది.
గిదండీ సంగతి. "అవ్వ మీద యాష్ట రాదు - బువ్వ మీద బుద్ధి తీరది" అంటే గిదే మరి. మన్లో ఎవ్వలికన్న అవ్వ, బువ్వ మీద యాష్ట కొచ్చుడు,బుద్ధి తీరుడు ఉంటదా? మీరే సెప్పుండ్రి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి