వేసవి సెలవులు. అక్కా చెల్లెళ్ళ పిల్లలు అందరూ ఒకచోట చేరారు. ప్రతిరోజూ ఆటలే ఆటలు. చందమామ, బాలజ్యోతి, చిన్న బొమ్మరిల్లు కథల పుస్తకాలు బోలెడు ఉన్నాయి. అయినా చదివేందుకు తీరిక ఎక్కడిది? రకరకాల ఆటలు. అందులో ఎక్కువగా ఆడే ఆట పేరు, ఊరు, సినిమా, వస్తువు ఆట. ఒక అక్షరం చెపితే అదే అక్షరంతో మొదలయ్యే పేరు, ఊరు, సినిమా, వస్తువు పేర్లు రాయాలి. ఒక్కో దానికి 10 మార్కులు. 4 సరిగా రాస్తే వారికి 40 మార్కులు. ఒకరిది మరొకరికి కలవవద్దు. ఉదాహరణకు అ అక్షరం ఎన్నుకుంటే ఇద్దరూ అనిల్ అనే పేరు రాస్తే ఇద్దరికీ మార్కులు రావు. కరెక్ట్ అయిన 3కే లెక్క ఉంటుంది.
ఐదుగురు ఈ ఆటకు పోటీ పడుతున్నారు. ఆ ఐదుగురిలో శ్రీను మరియు వాణీ తమ మార్కులు పోకుండా వెరైటీగా ఆడుతున్నారు. పేర్లు కొత్తగా సృష్టించి అందరినీ నవ్విస్తున్నారు. అలాగే వస్తువు పేర్లు వెరైటీగా రాస్తున్నారు. శ్రీను ప్రతి వస్తువు చివరా డ్రమ్ము అని తోక తగిలిస్తున్నాడు. ఉదాహరణకు 'కా'తో మొదలయ్యే వస్తువు రాయమంటే శ్రీను కారం డ్రమ్ము అని రాస్తున్నాడు. ఇంకొకరు కారం అని రాయవచ్చు కదా! ఒకరు కారం అని మరొకరు కారం డ్రమ్ము అని రాస్తే ఇద్దరి మార్కులు సురక్షితంగా ఉంటాయి అని ధైర్యం. అలాగే వాణీ ప్రతి వస్తువుకూ చివర ఫోటో అని తోక తగిలించేది. ఉదాహరణకు 'బ' గుణింతంతో వస్తువు పేరు రాయమంటే బ్రియాన్ లారా ఫోటో అని రాసేది. ఇలా ఆ ఆట కొనసాగినంత సమయం నాన్ స్టాప్ నవ్వులతో కొనసాగేది. ఏ హాస్య చిత్ర వీక్షణమూ ఈ ఆట ముందు పనికిరాకపోయేది. అలా రోజులు మంచులా కరిగిపోయేవి.
రెండు దశాబ్దాలు గడిచాయి. ఇప్పుడు పిల్లల బృందం అంతా చాలా పెద్ద వారైనారు. ఏవైనా వేడుకలు జరిగినపుడు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పడీ పడీ నవ్వేవారు. తమ పిల్లలకు ఆనాటి సరదా ఆటలను గురించి చెప్పారు. పిల్లలు వింటూ బాగా నవ్వినారు. ఈ తరం పిల్లల ఆనందాలను చూసి బాధపడుతున్నారు ఆ తరం వారు. తమలా ఎంజాయ్ చేయలేక పోతున్నారని. టీవీలు, సెల్ ఫోన్లు ఇదే ఈ తరం పిల్లల ఆనందాలు. సోషల్ మీడియాకు బీభత్సంగా బానిసలు అవుతున్నారు. ఆ రోజుల్లో ఇలాంటి ఇండోర్ ఆటలే కాదు. క్యారమ్స్, చెస్, పచ్చీసు, అష్టాచెమ్మా, దాడి, వామన గుంటలు వంటి ఇండోర్ ఆటలతో పాటు రింగ్ బాల్, షటిల్ వంటి ఆటలే కాక రకరకాల పల్లెటూరి ఆటలు ఆడేవారు. అవన్నీ కనుమరుగవడం నచ్చడం లేదు. ఈ తరం వినోదాలతో శారీరక, మానసిక ఆరోగ్యం శూన్యం. వ్యాయామం కరవై కొత్త కొత్త కొత్త అనారోగ్య సమస్యలలో ఇరుక్కుపోవవడం ఖాయం. ఆయుష్షు కూడా గణనీయంగా తగ్గడం ఖాయం. మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని తేవాలని నిశ్చయించుకున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి