ఇది కాపీల లోకం టోపీల లోకం.
వెరసి పాపాల'లోకం/ .
ఒకడు జుట్టు కత్తిరిస్తే
ఇక అందరూ
అదేదారి. దీనినే పెద్దోళ్ళు గొఱ్ఱెదాటు అనే
టోళ్ళుమాపల్లెటూళ్ళో.
చదవడానికి బద్దకం కానీ
సెల్లో ఆటలు, సినిమా
హాళ్ళు భలే ఇంట్రెస్ట్.
పరీక్షల్లో కాపీయే గతి/
తినే తిండికి తప్పలేదు
కాపీ.
దిబ్బరొట్టే పోయి దిగింది పిజ్జా
రూపాయితో పోయేది
వేయి రూపాయలే!
మాటలో కాపీ ఆటలో కాపీ. పెళ్లిళ్లు కాపీ,
ఇల్లిల్లూ నిండింది కాపీదేవత ఏదో ఒక రూపాన.
అభివృద్ధిని ఆహ్వానిస్తాం. కాని కాకూడదు
కాపీకి దాసోహం. "ఎక్కడికెళ్లినా నీ భాస వేషం నీదిగా
ఉంచుకో" అన్న వివేకానందుని మాట
నీ నోట నిత్యమూ పలకాలి.నువ్వు నువ్వుగా కట్టు బొట్టుతో జీవించు.
ఎక్కడికెళ్లినా వాళ్ళు నిన్ను కాపీ కొట్టేటట్టుగా ఉండాలి.
అలా నీ కట్టు బొట్టు తీసి గట్టున పెట్టకుండా,ఘనంగా వ్యవహరించు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి