****
"అవ్వా! అవ్వా! ఇంతకు మునుపు మా బల్లె పది సద్వుకున్న అన్నలు,అక్కలు కల్సి మీటింగు బెట్టిండ్రు. గా మీటింగుకి వొచ్చిన సార్లు పంతులమ్మలు ముసలి ముసలిగున్నరు.కొంత మందిరి మన జేజి తాతొతికెనె కర్ర బట్కొని నడవబట్టిండ్రు. ఇంకొంత మందిర్ని అన్నలు అక్కలు శెయ్యి బట్కొని శిన్నగ టేజీ మీదకి పట్కబోయి కూసుండ బెట్టిండ్రవ్వా!" ఇంతింత కళ్ళు తిప్పుకుంట భూలచ్మి చెబ్తుంటే...
"అవ్వా! అవ్వా! నేను సుత జూసిన.మన జేజి తాత లెక్కనే తల్కాయంత కొంగల్లెక్క తెల్లింట్రికలున్న సార్లొచ్చిండ్రు.టీచల్లు సుత వొచ్చిండ్రు తెల్సా?
"అవునా వారీ! గింతకి నువ్వు, భూలచ్మి గా సార్లు, పంతులమ్మలు ఏం జెప్పిండ్రో ఇన్నరా మరి?"
ముందుగాల అన్నలు అక్కలు గాళ్ళ శిన్నప్పుడు సార్లు, పంతులమ్మలు గాళ్ళకి పాఠాలు, మంచిమాటలు ఎట్ల జెప్పిండ్రో చెప్పిండ్రవ్వా.
ఓ అన్నైతే గిప్పుడేదో యాపారం జేత్తుండంట. గా అన్నకి శిన్నప్పుడు లెక్కలు అస్సలే రాకపోతుండెనంట. లెక్కల సారంట మస్తు కొట్టేటోడంట. గా సార్కి పచ్చరాయి ఉంగ్రం ఉండేదంట గా ఉంగ్రం ఉన్న శేత్తో మొట్టికాయలేశేటోడంట.శింత బరిగె దీస్కొని అర్చేతిల ఒక్కటంటిత్తే మల్ల తెల్లారి దనుక తల్కాయ,అర్సెయ్యి సులుకు సులుకు మనేవంట.
"గవి జెప్తుంటే నాకు మస్తు బయ్యమైందవ్వా! నాకు సుత లెక్కలు రావు.రేపు బల్లెకెల్లినంక మా టీచల్లకి గట్ల పచ్చుంగ్రాలు ఉన్నయో సూడాలె" అంటుంటే...
"ఒరేయ్ వారీ! గీ కాలంల మన టీచర్లు ఎవలన్న గట్టిగ కొట్టుడు జూసినవా?
అవ్వా! వీణ్ణైతే బుగ్గలోడు బుగ్గలోడు అన్కుంట బుగ్గలు సాగదీసి ముద్దు జేత్తరు.గీడేమో గిట్ల ఎచ్చిడి జేత్తుండు సూడు."
అవునా! బుడ్డోడా! ఇట్రారా! గీడు మస్తు మాటల్నేర్సిండు" అన్కుంట దగ్గరకు బొయ్యి బుగ్గలు సాగదీస్కుంట...
"నువ్వు జెప్పే బంగారీ! ఇంకక్కడి యిసయాలు"
"అవ్వా! ఓ అన్నకైతే శిన్నప్పుడు తింటానికి అన్నమే లేకుండెనంట.దినాం గిన్ని గంజినీల్లు దాగి వొచ్చేటోడంట.బల్లె ఓ పాలి పాఠం అప్ప జెప్కుంట కళ్ళు తిర్గి పడిండంట.నీళ్ళు జల్లి లేపి "ఏందిరా వారీ! ఎందుకట్లయింది? అడ్గితే సుట్టుపక్కల పిలగాండ్లు. "గాడు దినాం గట్లనే ఒత్తడు. పాపం ఆనింట్లె తింటాన్కేమి లేదు సర్!" అని జెప్పిండ్రంట.
"అయ్యో ! గీ సంగతి నాకు దెల్వకనే పాయె అన్కుంట'' ఇంగ గా సారు దినాం బల్లెకి గా అన్నకి సుత అన్నం,కూర బట్కొచ్చి తినమని ఇచ్చేటోడంట.సద్వుకోనీకి ఇంటికి దీస్కబోవుడంట. గా సారోల్ల పంతులమ్మైతె కడ్పు నిండ అన్నం బెట్టి కొడ్కు లెక్క జూస్కుందంటవ్వా!.గవన్ని జెప్కుంట ఒక్కపాలె ఏడ్చిండు.
అన్న గట్ల ఏడ్చే తల్కి అందర్కి కండ్లల్ల నీళ్ళొచ్చినయ్. నాకు సుత ఏడ్పొచ్చింది అవ్వా !"
"నువ్వు జెప్తుంటె నాకు సుత కండ్ల నీళ్ళు తిర్గినయి. ఇంతకీ గా అన్న ఏం జేత్తుండంటనే బంగారూ?"
"నేం జెప్తవ్వా! గా అన్న ఎన్కాల ఒకాయన పేద్ద తుపాకీ బట్కొని వొచ్చిండవ్వా! గాయనింట్ల మస్తు తుపాకులున్నయేమో! గజ్జూసి మస్తు బయమైంది.
"నీ మొకం గా అన్న ఎన్క తుపాకీ పట్కొండ్రంటే గా యన్న పెద్ద నాయకుడన్న మాట.
"అవునే బంగారూ! ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల్లాంటోళ్లకి రచ్చణకని గట్ల తుపాకీ పట్కొనే మణుషులుంటరు "
గిట్ల అన్నలు అక్కలు గాళ్ల శిన్నప్పటి బల్లె సార్లు, టీచర్లు సద్వు ముచ్చెట్లు చెప్పిండ్రవ్వా!"
" అవునే బంగారూ! విన్నవు గద!గాళ్ల శిన్నప్పటి ముచ్చెట్లల అన్నం పెట్టినోళ్ళని,తన్నులు తన్నినోళ్లని యాదికి దెచ్చుకోడం. అందుకే మన పెద్దోళ్ళు ఊకెనే అన్లే "అన్నం తిన్నోడు - తన్నులు తిన్నోడు" జల్మలో గాళ్ళని మర్సిపోరని.
"గట్ల ఆళ్ళ సార్లు జేసింది ఆళ్ళ బాక్కోసమే గద. గా యిసయం ఎప్పుడూ మతిల బెట్టుకోవాలె. సార్లు తిట్టిండ్రని,కొట్టిండ్రని శికాకు జెయ్యడం కాదు. గాళ్ళ మంచితనం యాజ్జేసుకుంట బత్కులో ఎదగాలే"...అవ్వ మాటల్ని భూలచ్మి బుడ్డోడు బుద్ధిగ యిన్నరు.
గదండీ సంగతి! గిదే కాదు ఆకలైనప్పుడు పిలిచి అన్నం పెట్టినోళ్ళని, అవసరమున్న లేకున్నా తిట్టి యిబ్బంది పెట్టినోళ్ళను,కొట్టినోళ్ళను ఎవ్వరూ సచ్చేదాక మరువరు. యెప్పుడు యాజ్జేసుకుంటరు. అందుకే గీ " అన్నం తిన్నోడు- తన్నులు తిన్నోడు మర్సిపోడు"అనే సామెత పుట్టుకొచ్చింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి