ఆది పర్వము సప్తమాశ్వాసము- * 43 వ రోజు*
దృపదుడు పాండవులను గుర్తించుట
విప్రుని మాటలకు దృపదుని సందేహం కొంతవరకు తీరినా మనసులో ఇంకా ఏదో సందేహం. అది తీర్చు కోవడానికి నాలుగు జాతుల వారికి అనువయిన రధాలను సిద్ధం చేయించి ధృష్టద్యుమ్నుని పాండవులను తీసుకురావటానికి పంపాడు. పాండవులు క్షత్రియులకు ఉచితమైన రధాలను ఎక్కి దృపదుని వద్దకు వచ్చారు. పాండవులకు ఎదురేగి అతిధి సత్కారాలు గావించి వారికి అనేక కానుకలు పంపాడు. పాండవులు క్షత్రియులకు ఉచితమైన ఆయుధాలను మాత్రం తీసుకున్నారు. దృపదుడు సంతోషించాడు. వారు క్షత్రియులన్న నిర్ధారణకు వచ్చారు. కానీ వారి నోటితో చెబితే బాగుంటుందని ధర్మరాజుతో " అయ్యా ! మీరు దేవతలా, గంధర్వులా, క్షత్రియులా లేక బ్రాహ్మణులా చెప్పి నా సందేహం తీర్చండి. మీ నిజ స్థితి తెలియకుండా నా కుమార్తెను ఎలా ఇవ్వగలను? " అన్నాడు. ఇక దాచడం భావ్యం కాదని ధర్మరాజు దృపద " మహారాజా ! మేము క్షత్రియులము. పాండురాజ పుత్రులము. నా పేరు ధర్మరాజు. వీరు భీమార్జున నకుల సహదేవులు. మత్స్యయంత్రాన్ని నా తమ్ముడు అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించాడు. ఈమె మా తల్లి కుంతీ దేవి " అని చెప్పాడు.
ద్రౌపది వివాహ ప్రస్థావన
అది విన్న దృపదుడు తన చిరకాల కోరిక నెరవేరిందని పొంగిపోయాడు. ధర్మ రాజు పక్కన కూర్చుని " విచిత్రవీర్యుని మనుమడు పాండురాజు కుమారుడు నాకు అల్లుడు కావడం నాకు సంతోషంగా ఉంది. స్వయంవరంలో అతడిని వరించిన కన్యతో అర్జునునికి వివాహం చేస్తాను " అన్నాడు. దానికి ధర్మరాజు " అర్జునుడి కంటే ఇద్దరం పెద్దవాళ్ళం ఉన్నప్పుడు అదెలా కుదురుతుంది " అన్నాడు. దృపదుడు " అయితే పెద్దవాడివైన నీవు వివాహం చేసుకో ధర్మబద్దంగా ఉంటుంది " అన్నాడు. ధర్మరాజు " అలా కాదు. అర్జునుడు తెచ్చిన భిక్ష ఐదుగురు పంచుకోవాలని మాతల్లి గారి కోరిక. అందువలన ఈ కన్యను మేము ఐదుగురం వివాహం చేసుకుంటాము " అన్నాడు. అది విన్న దృపదుడు " అదేమిటి? ఒక పురుషుడు చాలా మంది కన్యలను వివాహం చేసుకోవచ్చు. ఒక కన్యను మాత్రం ఎక్కువ మంది వివాహమాడటం లోక విరుద్ధం కనుక ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుంటాము " అన్నాడు. మరునాడు వ్యాసుడు అక్కడకు వచ్చాడు. అందరూ సమావేశమైన సమయంలో దృపదుడు వ్యాసునితో జరిగినదంతా వివరించి " మహాత్మా ! ఒక కన్యను ఐదుగురు పురుషులకు ఇవ్వడం లోక విరుద్ధం కాదా ? తమరే ధర్మ నిర్ణయం చేయండి " అన్నాడు. ధర్మరాజు చేతులు జోడించి " మాకు మా తల్లి దైవం. ఆమె మాటను మేము జవదాటం. నేను మాట వరుసకు కూడా అబద్ధం చెప్పను. నానోట ఈ మాట ఎలా వచ్చిందో తెలియడం లేదు. పూర్వం జటిల అను ఋషి కన్య ఏడుగురు ఋషులను వివాహమాడింది. దాక్షాయిని అనే కన్య ప్రచేతనులు అనబడే పదిమందిని వివాహం చేసుకుంది. కనుక దృపద మహారాజా ! ఆలోచించక నీ కుమార్తెను మా ఐదుగురికి ఇచ్చి వివాహం చేయవచ్చు" అన్నాడు. ఇరువురి వివాదం విన్న వ్యాసుడు కాసేపు ఆలోచించాడు. దృపదునితో " మహా రాజా ! నీ కుమార్తెను ధర్మరాజు చెప్పినట్లు వారైదుగురికి ఇచ్చి వివాహం చెయ్యి. ఇది ధర్మ నిర్ణయం. ఇందుకు కారణం చెపుతాను " అని చెప్పి దృపదుని ఏకాంతానికి తీసుకు వెళ్ళాడు.
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి