సంతోషం ఎక్కడ:- కవి మిత్ర,సాహిత్య రత్న -ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-పుష్యమి-హైదారాబాద్

 పచ్చడిమెతుకులైన
పదిమంది కలసి
పరమాన్నంలా తిన్నప్పుడు
కలిగే సంతోషం
కష్టాలలో ఉన్నప్పుడు
నేనున్నానని అభయహస్తం ఇచ్చే మనుషులున్నప్పుడు
 
మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన కలిగే ఆనందం చెప్పనలవి కాదు
అసూయ ద్వేషాలను వదలి
అనురాగ ఆత్మీయతలతో పలకరింపు
వృద్ధులకే కాదు ఎవరికైనా సంతోషమే
సంతోషమే సగం బలమన్నారు
ఆయుర్వృద్ధి కలుగచేయు
సంతోషం ధనం వలన కాదు సంతృప్తి వలననే కలుగునన్నది అక్షర సత్యం....!!
............................

కామెంట్‌లు