హైందవదా0పత్య...! :- కోరాడ నరసింహా రావు.

 ఒకరి కొరకె ఒకరు పుట్టి నట్టున్నట్టి అచ్చమైన హిందు దంపతులు వారు
  అందమైన బారెడు కొప్పు  న్న నీలవేణి తాను... 
 అతడు ముంగురులు సవరించి ప్రకటించె , భార్యపై తనకున్న అనురాగము ! 
 దా0పత్య మన్న... 
    ఇరువురిలో ఒకరి కన్న ఒకరు, యే ఒక్కరూ 
   గొప్ప కారని... 
 అన్ని0ట ఇరువురూ సమానులే నని... 
  బాధ్యతలు , హక్కులు ఇరువురకు సమానమేనని
 కష్ట, సుఖాలలో కలిసె బ్రతుకుదుమని... 
 పెళ్లినాటి ప్రమాణములను మరువక
 అన్యోన్యముగ బ్రతుకుట యే... హైందవ దాంపత్య ఔన్నత్యము...!! 
      
  సతి, పతుల ప్రేమాభిమా నాలు...పరస్పర సేవలలో పరవసించు నపుడే...!!
      ****
కామెంట్‌లు