ఓం శ్రీ గురుభ్యోనమః
శ్రీ మహాగణాధిపతయే నమః.
ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః.
ఈరోజు భగవద్గీత జయంతి సందర్భంగా ఆ జ్ఞాన పేటికలోని రత్నాక్షరాల వెలుగులు చదువరులు దర్శించాలని భావిస్తూ పి.వి.ఎల్. సుబ్బారావు గారు శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహముతో, నమస్కారము లతో సమర్పించుకుంటున్నారు.
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్ధనం,
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం.
*యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః.
తత్ర శ్రీః విజయో భూతిః ధ్రువా నీతిః మతిర్మమ*.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతామ్. ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే..
శ్రీమద్భగవద్గీత_-వ్యాసములు. - ఉపోద్ఘాతం.
భగవద్గీత-వేదసారం, ఉపనిషత్ సారం, పురాణ ఇతిహాస సారం, భగవంతుని చేరే రాజమార్గం, అన్నిటికీ మించినది"(మానవజాతి ఆపన్న హస్తం). మానవ వ్యక్తిత్వ వికాసానికి దారి చూపే వెలుగు మార్గం. మనిషి కుదేలైనప్పుడు అతడిని కుదుటపరిచి కర్తవ్యోన్ముఖుడ్ని చేసే దివ్య గ్రంథం. సర్వ కాలాలకు మానవజాతికి దైవమిచ్చిన అక్షరవరం. మానవులు వృద్ధాప్యంలో కాక, ప్రాథమిక స్థాయి నుండి ఈ గ్రంథం పఠించడం వాంఛనీయం. ఆ పఠనము వలన మనిషిని సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం దిశలో నడిపిస్తుందనడం నిర్వి వాదాంశము. మీ ముందు ప్రస్తుత పరిచే వ్యాసాల ఆశయం భగవద్గీత విషయం సరళంగా తెలుగులో తెలియజేయడం. తద్వారా చదువులకు మేలు పొందవలెనని నా అభిప్రాయం. ఈ వ్యాసములు చదివి ప్రభావితం అయి వారు మూలాన్ని చదివి ,మరింత మేలు పొందగలరని నా విశ్వాసం.(,, హరి-హామి ")
భగవద్గీత మొదటి శ్లోకము మనం జాగ్రత్తగా పరిశీలిస్తే "ధర్మం జయ"అని గొప్ప హామీతో ప్రారంభం అవుతుంది. ధర్మాచరణం మనిషికి వన్నె తగ్గని ఆభరణం. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మపథం" ప్రయాణం జీవన యానం కావాలి.
మనిషికి భగవంతుడు ఇచ్చిన హామీలు తలుచుకుందాం. తద్వారా భగవంతునిపై నమ్మకం, విశ్వాసం పెంచుకుందాం. అది భక్తిగా మారి సరి అయిన దారిలో మనల్ని నడిపిస్తుంది. మన జీవితం తప్పక తరిస్తుంది.
భగవానుడు అంటున్నాడు-=
ఓ భారతా! ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మం పెరిగి పోయినప్పుడు నన్ను నేను సృజియించుకొనుచు సాకార రూపములో ఈ లోకమున అవతరింతును. సత్పురుషులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు, ధర్మమును సుస్థిరమొనుర్చుటకు నేను ప్రతి యుగమునందు అవతరింతును. ఇది చక్కగా రుజువు చేయబడినది అవతారముల పరమార్థమిదే..
జితేంద్రయుడు, సాధన పరాయణుడు, శ్రద్ధ కలిగిన వాడు, అయిన మనుజునకు భగవ తత్త్వజ్ఞానము లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే ఏమాత్రం ఆలస్యం లేకుండా అతడు భగవ తత్త్వ రూపమైన పరమ శాంతిని పొందును. అలాంటివారు ఆ యుగాల నుండి నేటి వరకు మన ఎరుకలో ఉన్నారు. ఓవాల్మీకి ఓవ్యాసుడు, ఓత్యాగరాజు, ఓ రామదాసు, ఆహార విహారాల యందు, కర్మాచరణములయందు, జాగృత్ స్వప్నములయందు, యధా యోగ్యముగా ప్రవర్తించువానికి దుఃఖ నాశనమగు ధ్యానయోగము సిద్ధించును. నిస్సందేహముగా మనసు చంచలమైనదే. దానిని వశపరచుకొనుట మిక్కిలి కష్టం. కానీ అభ్యాస వైరాగ్యముల ద్వారా వశపరచుకొనుట సాధ్యము."
ఓ మహాత్ముడు, ఓఅరవిందుడు భగవత్ ప్రాప్తికై కర్తవ్యకర్మలను ఆచరించు వారెవరు దుర్గ తిపాలు కారు.సత్య హరిశ్చంద్రుడు సరి ఉదాహరణ.
నన్ను శరణు పొంది జరామరణ విముక్తికై ప్రయత్నించువారు, ఆ పరబ్రహ్మను, సమస్త ఆధ్యాత్మికమును, సంపూర్ణ కర్మమును తెలుసుకొందురు. అలా కాక అంత్య కాలమునందైనను తెలుసుకొనినావారు నిశ్చలబుద్ధితో నన్ను చేరుకొందురు. తెలిసుకొన లేకపోయినా అంత్యకాలమున నన్ను స్మరించుచు దేహత్యాగము చేసిన నన్నే పొందుదురు. ఇందు ఏమాత్రం సందేహం లేదు.
మహాత్మా గాంధీ చివరిగా అన్నమాట హే రామ్*దేహత్యాగమెనర్చునపుడు(అక్షర బ్రహ్మ స్వరూపమైన ఓంకారమును ఉచ్ఛరించుచు, ఆ ఓంకారమునకు అర్ధస్వరూపుడును, నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించువాడు మోక్షమును పొందును.
బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములు పునరావృతాలు. ఈ లోకములన్నియు కాలమునకు పరిమితమైనవి. కానీ నేను కాలాతీతుడను కనుక నన్ను చేరిన వారికి పునర్జన్మ ఉండదు.నన్నే (భగవంతుని) ప్రయత్నం పూర్వకముగా ఎరిగిన యోగి వేద పఠనము వలన, యజ్ఞ, దాన ,తపముల ,వలన కలుగు పుణ్యఫలం నిస్సందేహముగా త్రోసిరాజని సనాతన పరమపదమును పొందును.
పరమేశ్వరుడైన నన్ను నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు, నిష్కామ భావముతో సేవించు వారి యోగముఅప్రాప్యవస్తు ప్రాప్తి, మరియు క్షేమము ప్రాప్తించిన వస్తు రక్షణము నేను వహించు చున్నాను. ఇది మానవ జాతికి భగవంతుడిచ్చిన అద్భుతమైన హామీ.ఇది తలుచుకుంటే మనిషి ఎట్టి పరిస్థితుల్లో పతనం చెందడు.
మిక్కిలి దురచారుడైన అనన్య భక్తితో నన్ను భజించినచో వానిని సత్పురుషుని గానే భావింపతగును. ఏలనగా వాస్తవానికి అతడు నిశ్చయ బుద్ధి కలవాడు. అనగా పరమాత్ముని సేవించుటతో సమానమైనది. మరి ఒకటి లేదని శీఘ్రముగా ధర్మాత్ముడు అయి శాశ్వతమైన పరమ శాంతిని పొందును.
నా భక్తుడు ఎన్నడు నూ నష్టమునకు గురికాడు. అను విషయము నిర్భయముగా ఎరుగుము. ఈ హామీలు భక్తి యొక్క శక్తి, భక్తునిపై భగవంతుని గల అనురక్తి స్పష్టంగా ప్రకటితమ వుతుంది. భగవంతుని పొందడం ఎంతో సులువు అంటున్నాడు భగవానుడు (. నాయందే నీ మనసు లగ్నము చేయుము, నా భక్తుడవు కమ్ము, నన్నే పూజింపుము, నాకు నమస్కరింపుము. ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపిమత్ప రాయుడవైనచో నన్నే పొందగలవు.
నిరంతరము నా ధ్యానాదుల ద్వారా నాయందే లగ్న మనస్కులై భక్తిశ్రద్ధలతో నన్నే భజించువారికి నేను బుద్ధి యోగము ప్రసాదించె దను. దాని ద్వారా నన్నే పొందుదురు.
మనిషికి ఏమున్నా లేకున్నా బుద్ధి ఉంటే అతని జన్మ సార్ధకం. బుద్ధి లేకున్నా బుద్ధి తప్పిన వాని జీవితం నిరర్థకం. మన ఆహారం జీర్ణం చేసేవాడు పరమాత్మ. ఈ విషయంలో ఎంత స్పష్టమైన హామీయో చూడండి.
నేనే ప్రాణాపాన సమాయుక్తమైన వైశ్వానరాగ్ని(జఠరాగ్ని) రూపంలో సర్వప్రాణుల శరీరములో ఉండి నాలుగు విధములైన ఆహారములను 1 భక్ష్యములు,"(నమలబడేవి) 2 భోజ్యములు (మింగబడేవి)3 చోష్యములు(పీల్చబడేవి) 4 లేహ్యములు (నాకుచు తినేవి), జీర్ణము చేయుచుందును.
భగవంతుని ఉనికి చిహ్నము మనం తిన్న ఆహారం జీర్ణమవడం, నీవు శోకింపకుము అని ఓదారుస్తూ సంపూర్ణ శరణాగతి చూపాడు. సర్వ ధర్మములను అనగా సమస్త కర్తవ్యకర్మలను నాకు సమర్పించి, సర్వశక్తిమంతుడును, సర్వాధారుడును, పరమేశ్వరుడను అయిన నన్నే శరణు జొచ్చుము. అన్ని పాపముల నుండి నిన్ను విముక్తుడ్ని గావించెదను.
*ఈ హామీలన్నీ ఆనాటి ప్రార్ధునికే కాదు ఈనాడు పార్ధులమైన మనకు వర్తిస్తాయి. యుగాల యుగాల మార్పిడిలో మనుషులు మారుతారు. పరమాత్మ మారడు. పరమాత్మ మాట మారదు. మన జీవితానికి చక్కని బాట వేసి నడిపిస్తుంది. అర్ధాన్ని కల్పిస్తుంది పరమాత్మని చేకూరుస్తుంది.
ఈ క్రింది అధ్యాయములలోని శ్లోకముల భావములు పైన తెలుపబడినవి.
4_7,8, 39,.6-17,35,40.7-29,34,.8-5,13,16,28.9-22,30,31,34,.15 -14,.18-66.
శ్రీమద్భగవద్గీత_-వ్యాసములు.:- 1 : - డా.పివిఎల్ సుబ్బారావు.-విజయనగరం.-9441058797..
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి