శ్రీమద్భగవద్గీత వ్యాసములు 10:- పి.విఎల్.సుబ్బారావు-విజయనగరం-9441058797

అంశము ఆస్తి కుని ఆస్తి--భగవంతుని ప్రాప్తి

భాగము 2
శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్.జ్ఞానా ద్ధ్యానం విశిష్యతే!
ద్ధ్యానాత్ కర్మ ఫల త్యాగః త్యాగా చ్ఛాంతిరనంతరమ్!!
కర్మఫలత్యాగం మిక్కిలి శ్రేష్టం. దానివలన వెంటనే పరమ శాంతి లభించును. ఆ పరమ శాంతి పొందిన వాడే భగవత్ ప్రాప్తినొందినవాడు. భగవంతునికి ప్రియమైన వాడు. అని భగవానుడు తెలియజేశాడు. 
ఇప్పుడట్టి వారి*భగవత్ ప్రియుల*లక్షణాలు తెలుసుకుందాం.
వాటిని అక్షర క్రమములో తెలుసుకుందాం!,
1అ 1.అద్వేష్టాః--: సర్వ ప్రాణుల యందు ద్వేషం లేని వారు!
2.అనపేక్షః--: ఆపేక్ష లేనివాడు!
3.అనికేతః--: గృహముల యందు ఎట్టి ఆసక్తి లేనివాడు!
2ఈ
4. ఈర్ష నుండి ముక్తుడు!
3ఉ
5.ఉదాసీనహః--: పక్షపాతరహితుడు!
4క
కరుణా
6. హేతురహిత దయాళువు!
 7క్షమీః-: క్షమాగుణము కలవాడు! 
8. క్షోభ కలిగించని వాడు, క్షోభ పొందని వాడు!
5గ
9. గత వ్యధః-: దుఃఖము నుండి ముక్తుడు. 
6త
10. తుల్యనిందా సమస్తుతిః, నిందా స్తుతులను సమానముగా భావించేవాడు.
7ద. 
11. దక్షః-: నిపుణుడు! 
8ధ
12. ధృఢ నిశ్చయః, పరమాత్మ యందే నిశ్చయ బుద్ధి కలవాడు!
9న
13. నిర్మమః,- మమకారము లేనివాడు!
14. నిరహంకారః అహంకారము లేనివాడు!
15. నహృష్యతి. ఇష్ట ప్రాప్తికి లొంగనివాడు!
16. నద్వేషి-: దేనిని ద్వేషించనివాడు! 
17. నశోచతి-: దేనికి విచారపడనివాడు! 
18. న కాంక్షతి-: దేనిని కోరనివాడు! 
10భ
19. భయం నుండి ముక్తుడు 
11మ
20. మైత్రః. స్వార్ధ రహితమైన ప్రేమ కలవాడు! 
21. మయర్పిత మనోబుద్ధిః. నాయందే (పరమాత్మయందే) మనో బుద్ధులను అర్పించిన వాడు! 
22. మౌని-: ఈశ్వర స్వరూపమునుసదా మననము చేయువాడు!
12య
23 . యోగి. యోగి అయిన వాడు అన్ని వదిలిపెట్టిన (వదిలి) వేసిన వాడు. ఏది పట్టనివాడు!
24. యతాత్మా. శరీరేం ద్రియ, మనస్సులను వశపరచుకున్నవాడు!
25. యేనకించి త్.సంతుష్టః.. శరీర నిర్వహణకై ప్రాప్తించిన దానితోనే తృప్తిపడేవాడు! 
13శ
26. శుచిః... బాహ్యా భ్యంతరాలలో శుచి అయినవాడు!
27. శుభాశుభ పరిత్యాగి... శుభ అశుభ కర్మలను పరిత్యజించినవాడు.
14స
28. సతతమ్ సంతుష్టః... సర్వదా సంతుష్టుడై ఉండువాడు!
29. సమ దుఃఖ సుఖం... సుఖదుఃఖముల యందు సమ భావం కలిగిన వాడు! 
30. సమ శత్రుమిత్రేచ... శత్రుమిత్రుల యందు సమ భావం కలిగిన వాడు.
31. సమ మానావ మానయో... మాన అవమానముల యందు సమభావం కలిగిన వాడు! 
32. సమ శీతోష్ణేషు... ఉష్ణ శీతలముల యందు సమ భావము కలిగిన వాడు! 
33. సంఘవర్జితః... ఆసక్తి రహితుడు!
34. స్థిరమతిః... స్థిరమైన 
బుద్ధి కలవాడు!
15హ
35. హర్షము నుండి ముక్తుడు!
పైన పేర్కొన్న లక్షణములను కలిగి ఉంటూ, ధర్మామృతమును సేవించుచు, అదనంగా నిష్కామము, భక్తి శ్రద్ధలు, మత్పరాయణత్వం, కలిగి ఉండేవారు నాకు అత్యంత ప్రియులు అని పరమాత్ముడు 
భక్తి యోగం
చివర ప్రకటించాడు.
జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ 35 లక్షణాలు ఉత్తమ, ఉన్నత వ్యక్తిత్వానికి చిహ్నాలు. వీనిని కలిగి  ఉండడం, పెంచుకోవడం చేస్తూ సమాజంలో సందర్భానుసారం ప్రకటిస్తే, సమాజం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుంది. పౌరులందరూ భగవంతునికి ప్రాప్తులై జీవితం సాగించిన వారు అవుతారు. భగవంతుడు ప్రాప్తించడం అంటే అదేదో అలౌకికమైనది కాదు. భూమి మీద శాంతియుత జీవితానికి పునాది. అది ఏ కాలానికైనా సమాజానికి అత్యవసరం. కావున మనమంతా మన విధులను ప్రశాంత మనస్కులై ఆ లక్షణాలు పెంపొందించుకుని ఆ మార్గం అనుసరించి తరిద్దాం.!!
_______
శ్రీమద్భగవద్గీత
12వ అధ్యాయము భక్తి యోగము ద్వారా అక్షర రూప క్రమంలో తెలియజేసిన లక్షణములను పాటించుచూ, ధర్మ మార్గంలో నడిచి భగవంతుని శరణాగతి పొంది తరించమని భగవానుడు బోధించాడు. 
__దీని ద్వారా నేటి యువత జీవితంలోని సంఘర్షణలను ఎలా ఎదుర్కోవాలి  అనే అవగాహన చేసుకొని ఆచరించమని చెప్పడం ముఖ్యో ద్దేశం. 
_______

కామెంట్‌లు