శ్రీమద్భగవద్గీత*-వ్యాసములు*11:- పి.విఎల్.సుబ్బారావు-విజయనగరం-9441058797



 అంశము
క్షేత్రం క్షేత్రజ్ఞుడు జ్ఞానం
(దేహం దైవం-జ్ఞానం.
భాగము -1

మానవుడికి తన
 శరీరము, ఆ శరీరంలో ఉన్న దైవములకు సంబంధించిన జ్ఞానం ఎంతయో అవసరం. అయితే నేడు మనిషి జ్ఞానం బహుముఖం. అయితే అసలైనజ్ఞానం దైవ జ్ఞానం. ఇది తెలియకుండా ఎన్ని రకాల జ్ఞానం తెలుసుకున్నా ప్రయోజనం సిద్ధించదు. అందుకే భగవానుడు భగవద్గీత 13వ అధ్యాయములో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయో*పేరిటఈ జ్ఞానం వివరించాడు .
దేహము--: క్షేత్రము అని ఈ క్షేత్రాన్ని ఎరిగిన వాడు క్షేత్రజ్ఞుడు అని అంటాము. అన్ని క్షేత్రముల యందు ఉన్న క్షేత్రజ్ఞుడు అనగా జీవాత్మ పరమాత్మే! క్షేత్ర క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానం అనగా త్రిగుణాత్మకమైన ప్రకృతి. నిర్వివికార పురుష ( క్షేత్రజ్ఞుడు- జీవాత్మ -పరమాత్మల) తత్వం తెలుసుకొను జ్ఞానము.
క్షేత్ర స్వరూపము--పంచ మహా భూతములు, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి,, ద శేంద్రియములు, (5 జ్ఞానేంద్రియములు5, కర్మేంద్రియములు) మనస్సు పంచేంద్రియ గ్రాహ్య విషయములు (శబ్ద, స్పర్శ ,రూప ,రస, గంధములు), కోరిక ,ద్వేషము ,సుఖము, దుఃఖం ,స్థూల శరీరం, చైతన్యము.(శరీరాంతః కరణముల చేతనా శక్తి) ధృతి (సాత్విక, రాజస,తామస) అను వికారములతో కూడిన క్షేత్ర స్వరూపము.
జ్ఞాన ప్రాప్తికి సాధనములు---:
1. తానే శ్రేష్ఠుడని భావము లేకుండుట.(అమాన్వితం).
2. డాంబికము లేకుండుట
  3. అహింస, 4. క్షమాగుణము.5. మనోవాక్కుల యందు సరళత్వము.6., భక్తి శ్రద్ధలతో గురుజనుల సేవ.7. శౌచము--బాహ్యాభ్యంతర శుద్ధి.
8. బాహ్య శుద్ధి.---: నిజమైన స్వచ్ఛమైన వ్యవహారముల ద్వారా
1. ద్రవ్యశుద్ధి--అట్టి ద్రవ్యము ద్వారా అన్నముతో,  2ఆహార శుద్ధి,--యథా యోగ్య జీవన విధానము వలన 
3. ఆచరణ శుద్ధి--: జలమృత్తికాదుల చేత శరీర శుద్ధి. ఇవిబాహ్య శుద్ధిలోని భాగములు.
అంతఃశుద్ధి--:, రాగద్వేషములు ,కపటము మొదలగు వికారములునశించి అంతఃకరణం స్వచ్ఛమగుట. 
8. అంతఃకరణ స్థిరత్వం(స్థైర్యం). 9మన శ్శరీరేంద్రియ నిగ్రహం.
10. వైరాగ్యం. 11అహంకారరాహిత్యం.
12. జన్మ, మృత్యు, రోగాలను పదేపదే తలచుట.
13. భార్య ,పుత్రులు ఇల్లు ,సంపదలు, మున్నగువానియందు మమతా సక్తులు లేకుండుట.
14. ఇష్ట నిష్ఠ వస్తుప్రాప్తి వలన ఎట్టి మనోవికారములకు లోను గాకుండుట.
15. ఎల్లప్పుడును సమభావముతో ఉండుట. 
16. పరమేశ్వరుడైన నా యందు అనన్య యోగము ద్వారా అవ్యభిచారిణీ భక్తి కలిగియుండుట. సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడే కేవలము తన స్వామి యని భావించి, స్వార్థము అభిమానము త్యజించి పరమ శ్రద్ధా భక్తులతో భగవంతుని ,నిరంతరము సేవించుటనే "అవ్యభిచారిణి భక్తి" అని అంటారు.
17. ఏకాంత పవిత్ర ప్రదేశమున వసించు ప్రవృత్తి కలిగి ఉండుట.
18. విషయాసక్తులైన జనులయడ ఆసక్తి లేకుండుట.
19. ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్య స్థితుడై ఉండుట. (ఆత్మ అనాత్మ వస్తువును ఎరుంగుటకు తోడ్పడు జ్ఞానం).
20. తత్వజ్ఞానార్థ దర్శన ము.
ఈ 20 జ్ఞాన ప్రాప్తి సాధనములు
ద్వారా లభించేది సరైన జ్ఞానం దీనికంటే వేరైనది "
"అజ్ఞానం"
పరమాత్మ,---:
అనాది యైన, సనాతనుడైన పరబ్రహ్మయే తెలిసికొనదగినవాడు. అతనిని తెలిసికొనుట వలన మానవుడు పరమానందమును పొందును. అతడు సత్-అసత్ లకు అతీతుడు. ఆ పరమాత్మను గురించి సమగ్రముగా నీకు తెలుపుచున్నాను అంటున్నాడు భగవానుడు.
క్షేత్రము, జ్ఞానము, జ్ఞాన సాధన, తెలిసికోదగిన పరమాత్మ స్వరూపాలు--ఈ తత్వమును సమగ్రముగా తెలుసుకొనిననా భక్తుడు నా స్వరూపమునే పొందును అని భగవానుడు తెల్పుచున్నాడు .అది ఏ విధముగానో రెండో భాగములో తెలిసికుందాం.
_______
శ్రీమద్భగవద్గీత
13వ అధ్యా యము క్షేత్ర- క్షేత్రజ్ఞ విభాగ యోగము
1నుండి12వ శ్లోకములవరకు భావము  వ్రాయబడినది.
________

కామెంట్‌లు