భాగము 2
క్షేత్రం-క్షేత్రజ్ఞుడు-జ్ఞానం.(దేహం-దైవం-జ్ఞానం.
జ్యోతిషా మపితజ్జ్యోతిః తమసః పరముచ్యతే!
జ్ఞాన జ్ఞేయం జ్ఞాన గమ్యం హృది సర్వస్య విష్టితమ్!
భగవానుడు పరమాత్మను గూర్చి సమగ్రముగా
తెలియజేస్తున్నాడు.
ఓ అర్జునా!
ఆపరమాత్ముని చేతులు, పాదములు ,నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు, సర్వత్ర స్థితములై యున్నవి. అతడు సర్వమును ఆవరించి యున్నాడు.
వాయువు, అగ్ని ,జలము, పృధ్వి ,అనువాటికి ఆకాశం కారణం అగుటవలన వాటియందు అది వ్యాప్తమై, స్థితమై యున్నది. 1.అట్లే పరమాత్మ సంపూర్ణ చరాచర జగత్తుకు కారణమై ఉండుటవలన అందు వ్యాప్తుడై,స్థితుడై ఉన్నాడు.
2. అతడు ఇంద్రియ,గ్రాహ్య విషయములన్నింటిని ఎరిగిన వాడు. కానివాస్తవంగా ఇంద్రియాలకు అతీతుడు. ఆసక్తి రహితుడైనను సమస్త జగత్తు భరించి పోషించువాడు. అతని నిర్గుణడయ్యును (గుణాతీతుడైనను) ప్రకృతి సంబంధము వలన గుణా నుభవ ము కలిగి ఉంటాడు.
3. చరాచర భూతములన్నింటికి బాహ్యాభ్యంతరముల యందు పరిపూర్ణముగా ఉండువాడు. చరాచర రూపుడును అతడే! అది సూక్ష్మ (పరమాణు) రూపుడైనందున తెలిసికొన 1శక్యం కానివాడు .2 అతి సమీపస్థుడు,3. అతి దూరస్థుడు.!
4. పరమాత్మ ఆకాశము వలె విభజించుటకు వీలులేని ఒకే రూపము నపరిపూర్ణుడైయున్నను,సమస్త చరాచర ప్రాణుల రూపములలోను వేర్వేరుగా గోచరించుచుండును---. మహాకాశము. విభాగరహితమైనను కుండలలో వేర్వేరుగా గోచరించినట్లు పరమాత్మ సకల భూతములలో ఏకరూపుడుగా స్థితుడైయున్నను వేర్వేరుగా ప్రతీతుడగును. ఆ పరమాత్మయే సృష్టికర్త యైన
బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా ,లయ కారుకుడైన రుద్రునిగా తెలిసి కొనదగినవాడు.
5. ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకును జ్యోతి.--పరంజ్యోతి, మాయాతీతుడు, జ్ఞాన స్వరూపుడు, తెలిసి కొనదగినవాడు తత్వ జ్ఞానము ద్వారా ప్రాప్యుడు.! సర్వప్రాణుల హృదయములయందు విశేషంగా ఉండు వాడును అతడే!.
క్షేత్రము, జ్ఞానము, జ్ఞాన సాధన, తెలుసుకోదగిన పరమాత్మ స్వరూపాలు---ఈ తత్వమును సమగ్రమముగా తెలుసుకొనిన నా భక్తుడు నా స్వరూపమునే పొందును.---: అని భగవానుడు వచించాడు.!
ముఖ్యముగా జ్ఞాన ప్రాప్తికి సంబంధించిన ఒకటవ భాగములోని 20 సాధనములు తెలుసుకొని తద్వారా పరమాత్మ స్వరూపాన్ని అర్థం చేసుకొను దిశలో భక్తుడు పయనించాలి. అలా చేసిన నాడు అతడు తన లక్ష్యమును సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం దశలవారీగా నిస్సందేహముగా చేరుకో గలడు.! చెదరిన సూర్యకిరణాలను కేంద్రీకరించినప్పుడు అవి తీక్షణంగా ప్రకాశిస్తాయి. అలాగే ఏకాగ్రత వల్ల మన శ్శక్తులు దీప్తిస్తాయి. జ్ఞానానికి ఇదే సాధనం.! క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్య గల అంతరమును కార్యసహిత ప్రకృతి నుండి విముక్తులకు ఉపాయములను జ్ఞాన నేత్రముల ద్వారా ఎరిగిన మహాత్ములు పరమాత్ముని పొందియున్నారు!అని ఈ13వ అధ్యాయము మనకు తెలియజేయుచున్నది. కావున ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆచరణ పూర్వకంగా జీవితాన్ని సాగించి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహ పాత్రులవ్వాలి! అదే జీవితానికి సార్ధకత!.
_______
భగవద్గీత
13వ అధ్యాయం
క్షేత్రం క్షేత్రజ్ఞ విభాగయోగం
శ్లోకములు
12 నుండి 34 వరకు*భావము వ్రాయబడినది

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి