అంశము--:
క్షర_అక్షర. పురుషోత్తముల ప్రస్తావన
(శ్లో)*యస్మాత్ క్షరమతీతోహమ్ అక్షరాదపిచోత్తమః!
అతోస్మి లోకేవేదేచ ప్రథితః
పురుషోత్తమః
ఈ జగత్తు నందు క్షరుడు (నశ్వరుడు), అక్షరుడు(వినాశరహితుడు) అను రెండు విధములగు పురుషులే గలరు.
క్షరః-అక్షరః
గీత ఏడవ అధ్యాయంలో *అపరా "పరా"*ప్రకృతులుఅని తెలుపబడినవి. 13వ అధ్యాయంలో *క్షేత్ర-- క్షేత్రజ్ఞ" పేర్కొనబడినవి.
సకల ప్రాణులనశ్వరాలు, జీవాత్మ నాశరహితుడు. పై ఇద్దరికంటెను ఉత్తముడైన పురుషుడు వేరొకడు కలడు. అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు, పరమాత్మ. అతడు ముల్లోకముల యందును ప్రవేశించి అందరిని భరించి పోషించుచున్నాడు.
ఏలనన నశ్వరమగు జడవర్గము (క్షేత్రము) కంటెను నేను (భగవానుడు ) సర్వదా అతీతుడను.
నాశర హితమైన జీవాత్మకంటెను ఉత్తముడను. కనుక ఈ జగత్తునందును ,వేదముల యందును పురుషోత్తముడనని ప్రసిద్ధికెక్కితిని.
ఓ అర్జునా!
జ్ఞాని యైనవాడు ఈ విధముగా నన్ను తత్త్వతః పురుషోత్తమునిగా ఎరుంగును. సర్వజ్ఞుడైన అతడు వాసు దేవుడైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును.
ఓ పుణ్యపురుషా!!అర్జునా!! అత్యంత గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపితిని. దీని తత్వమును తెలుసుకొనిన మనుష్యుడు జ్ఞాని యై కృతార్థుడు కాగలడు.!!
ఇక్కడ పోతన గారు భాగవతంలో ప్రహ్లాద చరితము
చెప్పిన సీస పద్యము, భగవద్గీతలో 15వ అధ్యాయములో పురుషోత్తమయోగములో చెప్పిన ఆ పురుషోత్తమును పొందుటకు ఎంతగానో దోహదపడుతుంది.,
(సీస పద్యము) కమలాక్షునర్చించుకరములు, కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ,
సుర రక్షకుని జూచు చూడ్కులు, చూడ్కులు,
శ్రీ శేష సాయికి మ్రొక్కు శిరము ,శిరము.
విష్ణు నా కర్ణించు వీనులు, వీనులు.
మధువైరిదలచిన మనము మనము.
భగవంతు వలగొను పదములు పదములు.
పురుషోత్తముని మీద బుద్ధి బుద్ధి.
(!తేటగీతి)!--: దేవ దేవునిజింతించు దినము దినము. చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు,
కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు.
తండ్రి హరి చేరుమనియెడి తండ్రి, తండ్రి!!
1.-(దవిలిన)ధ్యానించిన ,నిలచిన.2. (వలగొను ),--వలను+కొను. ( ప్రదక్షిణించు),
3. (కుంభిని)--:, భూమి. (ధవుడు.)-భర్త . కుంభినీ దవుడు. .--: విష్ణువు.
శరీర భాగాలు మనస్సు, బుద్ధి, గురువు, తండ్రి, చదువు అన్నీ ఆయన మీద ముఖ్యంగా మన బుద్ధి పురుషోత్తముని మీద ఉంటేనే నిజమైన బుద్ధి,అవుతుంది.
భగవద్గీత సిద్ధాంతం (theory) అయితే పోతన గారి పద్యము. అభ్యాసము( practice) ఆ సిద్ధాంతం నిజం చేసే అభ్యాసం చేద్దాం తరిద్దాం.
అలా చేయకపోతే "ఈజన్మజన్మా! అంటూ మరియొక (సీస పద్యము)
, *కంజాక్షు నకు గాని కాయంబు కాయమే, పవన కుంభిత చర్మ భస్త్రి(తిత్తి) గాక,
వైకుంఠ బొగడని వక్రంబు వక్రమే,
ఢమ ఢమ ధ్వని తోడి ఢక్క(ఢంకా)గాక
హరి పూజనము లేని హస్తంబు హస్తంబే,
తరుశాఖనిర్మితదర్వి.
(గరిటె), గాక,
కమలేశుని జూడని కన్నులు కన్నులే, తను కుడ్యజాల రంద్రములు గాక.!!
,"(ఆటవెలది)--:: చక్రి చింతలేని జన్మం బుజన్మమే, తరళ సలిల బుద్బుదంబుగాక, విష్ణుభక్తి లేని విభుధుండు విబుధుడే (చదువరి), పాద యుగముతోడి పశువుగాక.!
పురుషోత్తముని తెలియపరచు విద్యే విద్య. ఆ విద్యనేర్చి మనమంతా చరితార్ధుల మవుదాం.!!.
దీనిభావాన్ని స్వీకరించండి. దాన్నే మననం చేయండి. దాన్నే కలగనండి. దానిలోనే పరవశులై జీవించండి. మీ మెదడు, కండరాలు, నరాలు శరీరంలోని ప్రతి భాగం కూడా ఆ భావంతో తన్మయం కావాలి. ఇదే కార్యసిద్ధికి దారి.
_______
శ్రీమద్భగవద్గీత
అధ్యాయం 15లోని
16 నుండి 20వ శ్లోకముల భావము వ్రాయబడినది.
______


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి