అంశము: దైవీ లక్షణములు-
శ్లో కము--:అభయం సత్త్వ సంశుద్ధిః జ్ఞాన యోగ వ్యవస్థితిః!
దానం దమశ్చ యజ్ఞశ్చస్వాధ్యాయ స్తప ఆర్జవమ్!
2.అహింసా సత్యమ క్రోధః త్యాగః శాంతిరపైశునమ్!
దయా భూతేష్వలోలుప్త్వం మార్ధవం హ్రీరచాపలమ్!
ఈ లోకమున ఉన్న మానవులు రెండు రకాలు.1. దైవ లక్షణములు గలవారు.2. అసుర లక్షణములు కలవారు.
ప్రతి వ్యక్తిలోనూ దైవ, దానవ లక్షణాలు రెండూ ఉంటాయి. ఏది పెంచుకుంటే ఆ స్వభావం వచ్చి దైవంగాను లేదా దానవునిగాను మారవచ్చు. అయితే కర్తవ్యం, అసుర లక్షణాలు తగ్గించుకుంటూ క్రమేపి శూన్యం చేసుకుని దైవ లక్షణాలు పెంచుకుంటూ పోతే మనిషే దైవం కాగలడు. మనం పెంచుకోవాల్సిన దైవీ సంపద గల*వారి లక్షణాలు అకారాది క్రమం!:--
*అ*1. అంతఃకరణ శుద్ధి 2. అగ్నిహోత్రాది ఉత్తమ కర్మ ఆచరణము.
3. అహింస. (మనోవాక్కాయ కర్మల ద్వారా
ఎవరికిని ఏ విధమగు కష్టము కలిగించకుండుట.)
4. అక్రోధము. (అపకారము చేయు వారిపై కూడా కోపము లేకుండుట)
5. అపైశునము. (ఎవరినీ నిందింపకుండుట)
6. అలోలుప్త్వము. (ఇంద్రియ విషయ సంయోగము ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండుట)
7. అచాపలము. (వ్యర్థచే ష్టలు చేయకుండుట)
8. అద్రోహము.( ఎవ్వరి పైనను శత్రుభావము లేకుండుట)
9. అమానిత్వం.
,(తాను పూజ్యుడనను అభిమానము లేకుండుట)
ఆ.10 ఆర్జవము. (శరీరేంద్రియ అంతఃకరణాల సరళత్వం,.)
ఇ11.( ఇంద్రియ నిగ్రహం)
క12. క్షమ.
త13. తత్త్వజ్ఞాన ప్రాప్తికై ధ్యానయోగమునందు నిరంతర దృఢ స్థితి.(జ్ఞానయోగ వ్యవస్థితః).
14.త్యాగము.15తేజస్సు.
ద16. దయ 17. ధైర్యం
న18.
నిర్భయత్వం.
భ19.. భగవంతుని నామ గుణ కీర్తనం.. 20భగవంతుని, దేవతలను, గురుజనులను పూజించుట..
మ21.. మార్దవము. (కోమలత్వము).
వ22. వేద శాస్త్రముల పఠనము, పాఠనం.
శ23.. శౌచము. 24శాస్త్ర విరుద్ధ కార్యాచరణమునకు వెనుకాడుట.(సిగ్గుపడుట).
25. శాంతి.
స26. సత్యము. 27.సాత్త్విక దానము..
---------------------------------
తేజస్సు--: శ్రేష్ఠ పురుషుల శక్తిని తేజస్సు అని అందరు. దాని ప్రభావం చే విషయాసక్తులైన నీచ ప్రవృత్తిగల వారు కూడా వారి ఎదుట ఇతరములైన (పాప) ఆచరణములను మానివారుచెప్పినరీతిగా ఉత్తమ కర్మలయందే ప్రవృత్తులగుదురు.
శౌచము ---:: బాహ్యాంభ్యంతర శుద్ధి--నిజమైన స్వచ్ఛమైన వ్యవహారముల ద్వారా ద్రవ్యశుద్ధి. అట్టి ద్రవ్యము ద్వారా సమకూరిన అన్నముతో ఆహార శుద్ధి. యధా యోగ్య జీవన విధానము వలన ఆచరణ శుద్ధి. జల మృత్తి కాదులచే శరీర శుద్ధి. ఇవి అన్ని యు బాహ్య శుద్ధిలోని భాగములు. రాగద్వేషములు, కపటము మొదలగు వికారములువర్జించి, అంతఃకరణం స్వచ్ఛమగుట ( అంతఃశుద్ధి.)
సత్యము ---:,అంతఃకరిణేంద్రియములద్వారాచేయబడిన
నిశ్చయ మును,అదే విధముగా ప్రియ వచనములను పలుకుట. (సత్యభాషణం). ఇవన్నీయు దైవీ లక్షణములు .
ఈ దైవీ లక్షణములను అభ్యాసంతో అంతర్గత శక్తి మేల్కొల్పుతుంది. క్రమంగా హృదయాన్ని సింహసదృశ్యమైన బలంతో అత్యున్నతమైన లక్ష్యాన్ని చేరుకుంటుంది. యోగం సిద్ధిస్తుంది. సిద్ధితో జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం నుండి ప్రేమ దానివల్ల పరమానందం లభిస్తాయి
_______.
శ్రీమద్భగవద్గీత
అధ్యాయము
16.లోని 1,2,3, శ్లోకముల భావము వ్రాయబడినది.
--------------------------------
శ్రీమద్భగవద్గీత వ్యాసములు 17.:- పి.విఎల్.సుబ్బారావు-విజయనగరం-9441058797
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి