అంత్య కాలంలో అంపశయ్యపై పవళించిన భీష్మ పితామహుడిని ఉత్తమ ధర్మాల గురించి అడిగి తెలుసుకోమని కృష్ణుడు యుధిష్టురుని ఆదేశిస్తాడు అని ప్రసంగం వింటున్న పావని అమ్మ దగ్గరకి చేరి..”అమ్మా యుధిష్టురుడు అంటే ధర్మ రాజే కదా. ఆ ధర్మాలేవో కృష్ణుడే చెప్పొచ్చు కదా. మరణబాధ పడుతున్న పెద్దాయనని ఎందుకు కష్టపెట్టటం” అని అడిగింది.
“అవును. కురుక్షేత్ర యుద్ధం పూర్తి అయ్యాక కౌరవులందరూ నశించాక, రాజ్య పాలన చేపట్టవలసిన ధర్మ రాజుకి అన్ని ధర్మాలు తెలియటం అవసరం. భీష్ముడు కురు పితామహుడు, ధర్మం తప్పని వాడు, అంత:కరణ శుద్ధి కలవాడు, సత్యవంతుడు. అందుకే ఆయన మాటకి శక్తి ఎక్కువ అని కృష్ణుడు అలా చెప్పాడు. ముందుగా ధర్మ రాజు “కిమేకం దైవతం లోకే, కింవాప్యేకం పరాయణం” అని భీష్ముడిని అడిగాడు. అంటే లోకం మొత్తం లోకి పూజించవలసిన ఏకైక దేవుడు ఎవరు? ఎవరు అందరి కంటే అధికుడు? ఎవరిని పూజిస్తే ఇంకా ఎవరినీ పూజించవలసిన అవసరం లేదు? అని దాని అర్థం” అన్నది విద్య.
“అమ్మా దేవుడు మనకి కనిపించడు. ఉన్నాడో, లేదో తెలియదు. మనమెవరం చూడలేదు. మాకు అర్థమయ్యేలాగా చెప్పమ్మా”అన్నది ఆరో క్లాస్ చదువుతున్న పావని.
“సరే..నీకు అర్థమయ్యేట్టే చెబుతా విను. లోకం మొత్తానికి ఒకే ఒక్క దేవత అంటే..ఉదాహరణకి మన ఇంటికి నాన్నగారు, స్కూల్ కి ప్రిన్సిపాల్, రాష్ట్రానికి ముఖ్య మంత్రి, దేశానికి ప్రధాన మంత్రి అనుకో. చిట్ట చివరి అధికారం, నిర్ణయం వారిదే! మనకి తప్పని సరిగా ఏ పని కావాలన్నా చివరి నిర్ణయం వారిది కనుక.. మన అవసరం వారికి అర్థమయ్యేలా చెప్పి, వారితో అణకువగా మాట్లాడి, వారు మనకి అనుకూలంగా ఆ పని చేసేట్లు ఒప్పుకునేవరకు వదలకుండా పట్టుకోవటం అన్నమాట.”
“ఉదాహరణకి నువ్వు స్కూల్ వాళ్ళతో పిక్నిక్ కి వెళ్ళాలనుకో..ఏం చేస్తావు. నాన్నా, నాన్నా ఒప్పుకోవా..డబ్బులివ్వవా..మా ఫ్రెండ్స్ అందరూ వెళుతున్నారు అని వెంటపడతావు. ఎక్కడ కూర్చుంటే అక్కడ చేరి ఎలాగైనా నాన్నని ఒప్పించటానికి గడ్డం పుచ్చుకుని బతిమాలతావు. కాఫీ చేతికందించి, నాన్నకి ఆఫీసుకి వెళ్ళేటప్పుడు బ్రీఫ్ కేస్ తీసుకెళ్లి ఇచ్చి, వీలైతే నాన్న బట్టలు ఇస్త్రీ అబ్బాయి దగ్గర నించి తెచ్చిచ్చి కాకా పడతావు..అవునా. అలాగే మనిషి ఒకే ఒక్క దేవుడు అయిన శ్రీమన్నారాయణుడిని వేడుకుంటూ, బతిమాలుతూ, భక్తితో భజనలు చేస్తూ అనుక్షణం ఆయన నామస్మరణ చేస్తూ..మిగిలిన విషయాలన్నీ వదిలేసి ఆయనకి దగ్గరవ్వాలని. ఆయనొక్కడికి దగ్గరైతే చాలు..మిగిలిన దేవుళ్లంతా ఆయన అంశలే! ఎలా అంటే ప్రభుత్వం అనేది ఒకటే..పవర్, నీళ్లు, విద్యా, వైద్యం, న్యాయం..ఇలా శాఖలు చాలా ఉంటాయి. ఆ ప్రభుత్వం శాసన సభలో తీసుకునే నిర్ణయాలే అన్ని శాఖల వారు అమలు పరుస్తారు. ఇప్పుడు అర్థం అయిందా” అన్నది అమ్మ పావనిని దగ్గరకి తీసుకుంటూ!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి