శ్రీమద్భగవద్గీత వ్యాసములు 20:- పి.విఎల్.సుబ్బారావు-విజయనగరం-9441058797

 అంశముపరమాత్మ పేర్లు

శ్లోకము
ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ స్త్రి విధః స్రృతః!
బ్రహ్మాణాస్తేన వేదాశ్చ యజ్ఞ్యాశ్చ విహితాః పురా!.
ఓమ్,తత్,సత్, అని మూడు విధములగు పేర్లు సచ్చిదానంద ఘన పరబ్రహ్మకు నిర్దేశించబడినవి. ఆ పరమాత్మ నుండి యే సృష్ట్యాది యందు బ్రాహ్మణాది సమస్త ప్రాణులు, వేదములు, యజ్ఞములు ఏర్పడినవి. 
అందువలన వేద మంత్రములను పఠించువారు, శాస్త్రవిహితములైన యజ్ఞదాన తపశ్చర్యలను సర్వదా "ఓమ్"అను పరమాత్మ నామమును ఉచ్చరించుచునే ప్రారంభింతురు. మనం కూడా దైవ నామానికి ముందు" ఓం." చేర్చి పలుకుతాము.
ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః.
మోక్షకాంక్ష గలవారు స్వలాభా పేక్షలే శమాత్రమైనను లేకుండా లోక హితార్థమై యజ్ఞదాన తపశ్చర్యలను ఇదిఅంతయును పరమాత్మదే"*అను భావముతో"తత్"నామమును ఉచ్ఛరించుచు చేయుదురు.
గాయత్రీమంత్రం
ఓం భూర్భువఃస్సువః. "తత్స"వితుర్వరేణ్యం!, భర్గో *దేవస్య" ధీమహి ధియోయోనః"ప్రచోదయాత్!!
*గయ"త్రాయతి"---గయాన్,త్రాయతే:-ఇతిగాయత్రీ"
గయలు--ప్రాణములు 
త్రాయతే "--రక్షించడం. *  
 ఓం భూర్భువస్వః, తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి  ధియోయోనః ప్రచోదయాత్.! ఇది ప్రాణములను రక్షించే మంత్రం అని "ఆది శంకరుల ప్రబోధం..
ఓం--: పరమేశ్వరుడు, సర్వ రక్షకుడు. .
భూః--: సత్ స్వరూపుడు. (ఉనికి కలవాడు)"
భువః--: చిత్ స్వరూపుడు (జ్ఞాన రూపుడు)
స్వం--: ఆనంద స్వరూపుడు (దుఃఖరహితుడు)
తత్--: అట్టి సచ్చిదానంద లక్షణ యుక్తమైన పరమేశ్వరుడు
సవితుః--: ఈ సృష్టికర్త 
వరేణ్యం--: సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు.
భర్గః--: శుద్ధ స్వరూపుడు (పాప రహితుడు)
దేవస్యః--: అట్టి అనేక దివ్య గుణములను కల్గిన దేవుని యొక్క దివ్య స్వరూపం.
ధీమహి--: హృదయాం తరాల్లో (ఆత్మలో ఏకమై) 
యః--: ఆ పరమేశ్వరుడు
నఃద్యః--: మా బుద్ధులను 
ప్రచోదయాత్--: సత్కర్మల యందు ప్రేరేపించి అభ్యుదయ శ్రేయములు పొందు సమర్థం చేయుగాక! 
తత్--: శ్లోకము --:
తతోవై నిష్పత్తిః సభు విమతి మాన్ పండిత వరః, విజానన్ గుహ్యం యో మరణ జీవన యోస్తదఖిలం, అనంతే సంసారే విచరత భయా సక్తి రహిత, స్తధా నిర్మాణం వై నిజ గతి విధీనాం ప్రకురుతే,!.
భావం--:, జీవుని పుట్టుక గిట్టుటలో గల అంతర్యాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించబడేదే తత్. దీని ద్వారా వచ్చే జ్ఞానమే సకల జీవులు సక్రమ మార్గములో చరించుటకు ప్రేరేపిస్తుంది.
ఓపార్థా!
*సత్*అను పరమాత్మ నామము సత్యభావమునందును, శ్రేష్ట భావమునందును,, అనగా పరమాత్ముడు నిత్యుడు, శ్రేష్టుడు అనుభావమునందు ప్రయోగింపబడుచుండును. ఉత్తమ కర్మాచరణము నందును "*సత్*అను శబ్దము ప్రయుక్తమగుచుండును".
సత్ సంగం-/సత్సంగం--: "సత్"అను పేరు గల భగవానునితో సంగం.
"సత్" పురుషులతో సంగం,సత్
గ్రంధాల తో సంగం,
"సత్" కార్యాలతో సంగం.
యజ్ఞ, దాన ,తపఃక్రియల యందు నిష్ఠ, ఆసక్తిక భావమును సత్ అని అందురు. పరమాత్మను ఉద్దేశించి చేయబడును నిశ్చయాత్మక కర్మలను కూడా "సత్ "అని అందురు.
గమనిక--:
ఓ అర్జునా!
శ్రద్ధ లేకుండా చేయబడు హోమము, ఇచ్చు దానము, ఆచరించు తపస్సు, ఇతర శుభ కర్మల న్నియును "అసత్"అని చెప్పబడును. దానివలన జీవించి ఉన్నప్పుడు, మరణించిన పిదప ఎట్టి ప్రయోజనము కలుగదు.అని శ్రీకృష్ణ పరమాత్మ శాస్త్ర విధిని, శ్రద్ధగా చేయు విధానమును తెలియజేశాడు.
ప్రతి కర్తవ్యము పవిత్రమైనదే. శ్రద్ధా భక్తులతో కూడిన కర్తవ్య నిర్వహణ పరమోత్కృష్టమైన ఈశ్వరారాధన. శ్రద్ధాభావంతో ఏమి చేసినా నీకు అది మేలే. చాలా చిన్న పని నైనా సవ్యంగా శ్రద్ధగా చేస్తే మహాద్భుత ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి తాను చేయగల ఎంత చిన్న పనినైనా శ్రద్ధతో నిర్వహించాలి.
-------------------------------
శ్రీమద్భగవద్గీత
అధ్యాయము
17లోని23నుండి28వ
శ్లోకముల భావము వ్రాయబడినది
--------------------------------

కామెంట్‌లు