అంశము: త్రిగుణములు*6విషయములు.జ్ఞానము--1సమస్త ప్రాణులలో పరమాత్ముడే ఉన్నట్లు జ్ఞాని చూచును అదిసాత్త్విక జ్ఞానము..
2సమస్త ప్రాణులను వేర్వేరుగా భావించు జ్ఞానము రాజస జ్ఞానము
3 శరీరమే సమస్తము దాని యందే ఆసక్తి కలిగించే అర్ధరహిత తుచ్ఛ జ్ఞానము తామసజ్ఞానము.
2 కర్మ--:,1 కర్తృత్వా భిమానము, ఫలా పేక్షగాని లేని పురుషుని చేత రాగ ద్వేషరహితముగా చేయబడు శాస్త్ర విహిత కర్మ "సాత్త్విక కర్మ"
2 భోగలాలసుడు, అహంకారి చేత మిక్కిలి శ్రమతో కూడిన కర్మ
"రాజసకర్మ"
3 పరిణామం ,హాని, హింస సామర్థ్యములను చూచుకొనక మూర్ఖత్వముతో ఆచరింపబడే కర్మ "తామసకర్మ"
3 కర్త--:,1 ఆసక్తిని త్యజించినవాడు, అహంకార భాషణం చేయనివాడు,
ధైర్యోత్సాహములు గలవాడు, సిద్ధి అసిద్ధులయడ హర్ష శోకాది వికారాలకు లోను కాని వాడు. "సాత్త్విక కర్త"
2. ఆసక్తియుతుడు, కర్మ ఫలములకై ఆరాటపడువాడు, లోభి, ఇతరులను కష్టపెట్టు స్వభావము కలవాడు, అపవిత్ర ప్రవర్తన గలవాడు, హర్షశోకాదులకు లోనగువాడు "రాజసకర్త."
3. జితేంద్రియుడు కానివాడు, సుశిక్షితుడు కానివాడు, మూర్ఖుడు, దూర్తుడు, అకారణముగా ఇతరుల వృత్తులకు విఘాతం కలిగించేవాడు, సదా చింతాగ్రస్తుడు, సోమరి, దీర్ఘసూత్ర (కార్యాచరణమునందు ఉపేక్షతో కాలము గడుపుచుండు వాడు) "తామసకర్త."
4. బుద్ధి--:1 ప్రవృత్తి-- నివృత్తి,
కర్తవ్యం- అకర్తవ్యం,
భయం ,-అభయం,
బంధం -మోక్షం, యదార్ధముగా తెలుసుకును బుద్ధి "సాత్త్విక బుద్ధి"..
1గృహస్థాశ్రమముననే ఉండి ఫలాసక్తులను త్యజించి, భగవదర్పణ బుద్ధితో కేవలం లోకహితార్ధమై జనకమహారాజు వలె ప్రవర్తించుటను "ప్రవృత్తి"మార్గమని, శుక, సనకాది మహర్షుల వలె సంసారము నుండి ఉపరతులై చరించు మార్గం "నివృత్తి"!,
2 ధర్మాధర్మముల యొక్క, కార్యకార్యముల యొక్క, కర్తవ్యాకర్తవ్యముల యొక్క, యదార్థతత్త్వములను తెలియజాలని బుద్ధి ,"రాజసబుద్ధి,"!
3. అధర్మమును ధర్మముగను, అట్లే ఇతర విషయముల ను తద్విపరీతముగా భావించు బుద్ధి
"తామస బుద్ధి".!
5. ధృతి--:
1.భగద్విషయములను తప్ప సంసారిక విషయములయందు ఆసక్తుడగుటను వ్యభిచార దోషము అందురు. అట్టి దోష ము లేకుండుటను "అవ్యభిచారిణీ ధారణ శక్తి"అందురు. ఇటువంటి చలించని ధారణాశక్తితో మనుష్యుడు ధ్యాన యోగము ద్వారా మనః ప్రాణేంద్రియక్రియను ధారణ చేయు శక్తిని"సాత్త్విక ధృతి "అందురు.!
మనస్సు,, ప్రాణేంద్రియములను భగవత్ ప్రాప్తి కొరకై భజన, ధ్యానం, నిష్కామ కర్మల యందు లగ్నం చేయుటను" మనః ప్రాణేంద్రియ క్రియాః"అందురు.
2. కర్మ ఫలేచ్ఛ గల మనుజుడు మిక్కిలి ఆసక్తితో ధర్మార్థ కామ విషయములను ధారణ చేయు శక్తిని "రాజసధృతి" అందురు
3. నిద్ర, భయము, చింతాశోకములు, ఉన్మత్తతలను విడువక దుర్మతి అయిన మనుష్యుడు వాటినే సంతతము ధారణ చేయుచుండును. అట్టి ధృతిని "తామసధృతి" అందురు
6. సుఖం--:1 ఆటల యందు ఆసక్తుడైన బాలునకు అజ్ఞాన కారణంగా విద్యాభ్యాసము విషము వలె తోచును. అట్లే విషయాసక్తులైన వారికి భగవద్భజన, ధ్యానము, సేవాది సాధనల అభ్యాస మహత్త్వము తెలియని కారణమున మొదట అది విషతుల్యముగా కనిపించును. ఏసుఖమునందు సాధకుడు భజన ,ధ్యాన, సేవాదులను నొనర్చి ఆనందించునో, దుఃఖములను అతిక్రమించునో, ప్రారంభమునందు విషతుల్యముగా తోచినప్పటికి, పరిణామమున అమృత తుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయములలో నిమగ్నమగునో అట్టి సుఖమును *"సాత్త్విక సుఖము "*అందురు.
2. విషయేంద్రియముల సంయోగము వలన కలుగు సుఖము మొదట అమృతతుల్యముగా అనిపించినను పరిణామము వలన అదివిషతుల్యమగును. అట్టి సుఖము "*రాజస సుఖము"
3. నిద్ర ,సోమరితనము, ప్రమాదము (మోహము) ల వలన ఉత్పన్నమగు సుఖమును "తామస సుఖము "అని అందురు. ఇట్టి సుఖము భోగ సమయమునందు నుపరిణామమునందును ఆత్మను మోహింపజేయును.
అని శ్రీ కృష్ణ పరమాత్మ కర్మసిద్ధి, త్రిగుణములైన సాత్త్విక, రాజస, తామస గుణముఆరు విషయములను గూర్చి వివరముగా తెలియజేసెను.!
దీనివలన ప్రతి వ్యక్తి విశ్వాసం ,సౌశీల్యం నిస్వార్ధం, ప్రేమించే హృదయం, భావించే మంచి మనస్సు బుద్ధి,, పవిత్రత, పరిపూర్ణ విధేయత, ఆఖండమైన ఉత్సాహం, అప్రతి హతమైన శక్తి, కలిగి ఉండాల్సిన లక్షణములు.
నాయకత్వాన్ని వహించేటప్పుడు సేవకుడిగా, నిస్వార్ధంగా, అనంత సహనం, కలిగి ఉన్నప్పుడు విజయం తథ్యం. భౌతిక సంపదకు, నైతిక పురోగతికి మధ్య అభిలాషీనీయమైన సమతుల్యం ఉంటేనే వ్యక్తికి శాంతి ,సమాజానికి ఉన్నతమైన అభ్యుదయముచేకూరుతుందిఅనడంలో సందేహం లేదు.
-------------------------------
శ్రీమద్భగవద్గీత
అధ్యాయము 18
19నుండి40వ శ్లోకముల భావము వ్రాయబడినది
---------------------------------
శ్రీమద్భగవద్గీత వ్యాసములు 23:- పి.విఎల్.సుబ్బారావు-విజయనగరం-9441058797
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి