28న కొరవే పురస్కార ప్రదానాలు

  కొత్తూరు రచయితల వేదిక తొమ్మిదో నెల సమావేశం ఈనెల 28న ఆదివారం ఉదయం నిర్వహించనున్నట్లు కొరవే అధ్యక్షులు కలమట శ్రీరాములు తెలిపారు. మండల కేంద్రంలో గల విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు. గుంటూరులో వచ్చే నెల మూడవ తేదీ నుంచి మూడు రోజులపాటు ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న సందర్భంగా ఈ సమావేశంలో కొరవే పురస్కారాలను అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. 
కొత్తూరు మండలంలో పరిసర ప్రాంతాల్లో పలు రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులైన పలువురు ప్రముఖులను ఎంపిక చేసి ఈ కార్యక్రమంలో శాలువా, జ్ఞాపిక, సన్మాన పత్రం, నగదు పారితోషికాలతో పురస్కార ప్రదానం గావించనున్నట్లు 
శ్రీరాములు తెలిపారు. 
కొరవే ప్రధాన కార్యదర్శి అమ్మల కామేశ్వరి కొరవే పురస్కార గ్రహీతల జాబితాను విడుదల చేసి ప్రకటించారు. పెద్దిన కులశేఖర ఆల్వార్, పారశెల్లి రామరాజు, సల్ల మన్మధరావు, ఇప్పిలి జానకిరామయ్య, వైశ్యరాజు వెంకటరాజు గుప్తా, పేడాడ గురుమూర్తి, బలగ హరిప్రసాదరావు, పొగిరి రవి లనే ఎనిమిది మంది ప్రముఖులను కొరవే పురస్కారాలతో సత్కరించనున్నామని కామేశ్వరి తెలిపారు. సహ కార్యదర్శి గడసాపు ఉషారాణి మాట్లాడుతూ సన్మాన పత్రాలను ఎవిఆర్ ఎం దిలీప్ రాజా పట్నాయక్ రచించారని, వాటిని వినిపించి బహూకరిస్తారని తెలిపారు. కోశాధికారి వైశ్యరాజు హరనాథరాజు మాట్లాడుతూ పురస్కార ప్రదానాల అనంతరం ఉపాధ్యక్షులు ముదిల శంకరరావు నేతృత్వంలో కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. 
గౌరవాధ్యక్షులు పెద్దిన కులశేఖర ఆల్వార్ మాట్లాడుతూ 
కొత్తూరు రచయితల వేదిక ఇప్పటివరకూ నిర్వహించిన 
నెల వారీ సమావేశాలను ముచ్చటించారు.
24.04.2025న వ్యవస్థాపక అధ్యక్షులు కుదమ తిరుమలరావు చే కొరవే ఆవిర్భావం,
లోగో ఆవిష్కరణ, కవిసమ్మేళన సత్కారాలు,  
26.05.2025న పొట్నూరు కోటిబాబు ముఖ్య అతిథిగా జరిగిన సభలో 
ముదిలి శంకరరావు సౌజన్యంతో విద్యార్థులకు కాపీబుక్స్ బహూకరణ, కవి సమ్మేళన సత్కారాలు, 
29.06.2025న రౌతు నరసింహప్పడు ముఖ్య అతిథిగా జరిగిన సభలో కుదమ తిరుమలరావుచే కొత్తూరు కవనం అనే సంకలనం ఆవిష్కరణ,  
కవి సమ్మేళన సత్కారాలు. 
27.07.2025న పారశెల్లి రామరాజు
ముఖ్య అతిథిగా జరిగిన సభలో 
విద్యార్థులకు బహుమతులు. 
29.08.2025న గిడుగు రామమూర్తి జయంతి వేడుకలు.
21.09.2025న గురజాడ జయంతి వేడుకలు. 
26.10.2025న పెద్దిన కులశేఖర ఆల్వార్ ముఖ్య అతిథిగా జరిగిన సభలో దిలీప్ పట్నాయక్ సౌజన్యంతో తెలుగు స్టడీ మెటీరియల్స్ ను హైస్కూల్ విద్యార్థులకు బహూకరణ.
16.11.2025న కొత్తూరు శాఖా గ్రంథాలయంలో, ఆ గ్రంథాలయ వారోత్సవాలలో కొరవే 
భాగస్వామ్యంతో కవి సమ్మేళనం.
ఈనెల తొమ్మిదో సమావేశంగా 28.12.2025న ప్రపంచ తెలుగు సభల నేపథ్యంలో 8మంది ప్రముఖులకు 'కొరవే' పురస్కారాల ప్రదానాలతో సన్మానించనున్నట్లు, 
కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి విద్యావంతులు,  సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరవ్వాలని ఆయన కోరారు.
కామెంట్‌లు