వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
10.మనోరూపేక్షుకోదండా(అష్టాక్షరీ)
11.పంచతన్మాత్రసాయకా
(అష్టాక్షరీ)
పదకొండవ నామ మంత్రము - ఓం పంచతన్మాత్రసాయకాయై నమః
సాయకములు = బాణములు
ఎడమవైపు క్రింది చేతిలో "అనురాగము" అనే పాశమును పట్టిన తల్లి, తన కుడివైపు క్రింది చేతిలో "క్రోధము" అనే అంకుశాన్ని వుంచుకుని, ఈ చరాచర జగత్తును పట్టి పీడిస్తున్న దుష్టశక్తులను శిక్షిస్తున్నది. అమ్మ , తన మనసును చెరుకు గడ విల్లు రూపముగా చేసికుని తన కుడివైపు పై చెతిలో పట్టుకుని వుంది. "శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనే పంచభూతముల సూక్ష్మ రూపము - అనబడే పంచతన్మాత్రలను తన బాణములుగా చేసికొని ఎడమవైపు పై చేతిలో పట్టుకుని వుంది పరమేశ్వరి." అటువంటి, జగజ్జననికి నమస్కారము.
అమ్మలగన్న అమ్మ స్థూలరూపం పైవిధంగా ఉంది.
శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు జ్ఞానేంద్రియాల యొక్క సూష్మ అంశాలు. వీటినే "పంచతన్మాత్రలు" అంటారు. ఈ చరాచర జగత్తును సృష్టించడానికి, స్థూలదేహ నిర్మాణము చేయడానికి అమ్మ పంచభూత తన్మాత్రలను చేర్చి తన సృష్టి రచనా కార్యానికి వాడింది. కనుక, "పంచతన్మాత్రసాయకా" అని వశిన్యాది వాగ్దేవతలు అమ్మను పిలిచారు.
పంచతన్మాత్రసాయకా = ఐదు తన్మాత్రలను బాణములుగా ధరించినది, పరమేశ్వరి, లలితా పరాభట్టారిక
తల్లి గర్భంలో వున్న నాటి నుండి ప్రతీ జీవి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను చేస్తుంది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సృష్టి లో ఒక్కొక్క ప్రాణికీ ఒక్కో విధంగా వుంటాయి. తల్లి గర్భంలో కూడా, ప్రాణికి, తన ప్రాణములో ఐదు భాగములు ఉంటాయి. ఇవే "పంచ తన్మాత్రలు". ప్రతీ ప్రాణీ చేసే పనులన్నీ ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు ప్రాణములు, మనో-బుద్ధి-చిత్త-అహంకారములు అనే 19 తత్వముల ద్వారా జరుగుతుంది. ఇది సమిష్టి సూష్మ శరీరం.
పైన చెప్పిన 19 తత్వములలో, మూలములైన ఐదు తత్వాలు ఆకాశము-వాయువు-అగ్ని-జలము-భూమి లను పంచ తన్మాత్రలు అంటారు. ఇవి ఐదు సృష్టికి ముందుగానే వుండటం వలన వీటిని పంచభూతములు అని కూడా పిలుస్తున్నాము. వీటిని సూచిస్తున్నట్టుగానే పరమేశ్వరి ఐదు బాణములను తన ఎడమవైపు పై చేతిలో పట్టుకున్నది. ఈ జగత్తు లో పుట్టిన ప్రతీ జీవి తన పూర్వ జన్మలలో చేసిన కర్మల ఫలితాలను బట్టి న్యాయబద్ధంగా వారికి రావలసిన భాగాన్ని వారికి ఇస్తోంది, పరమేశ్వరి.
శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనే పంచ తన్మాత్రలను బాణములుగా ధరించియున్నది జగన్మాత.
జగన్మాతను స్మరించి నమస్కరించేడప్పుడు ఓం పంచతన్మాత్రసాయకాయై నమః అని అనాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి