వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
12. నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా(షోడశాక్షరీ)
13. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా (షోడశాక్షరీ)
పదమూడవ నామ మంత్రము -
ఓం చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచాయై నమః
చంపక, అశోక, పున్నాగ, సౌగంధిక పుష్పాలను తన కొప్పలో ధరించిన జగజ్జననికి నమస్కారము.
చిదగ్ని కుండము నుండి ఉద్భవించిన అమ్మకు సకల అవయవములు వివిధ దేవతల అంశలుగా ఇవ్వబడ్డాయి. పరమేశ్వరి యొక్క ఆయుధములు సకల దేవతల ఆయుధములే. యాగ కుండము నుండి బయటకు వస్తున్నప్పుడు, అమ్మ శిరస్సు ముందుగా దర్శనమిచ్చింది. ఇలా శిరస్సు తో అమ్మ ఆవిర్భావం కనపడగానే, పరమేశ్వరి స్థూల రూప వర్ణనను, శిరస్సు నుండి మొదలు పెట్టారు వశిన్యాది వాగ్దేవతలు. అమ్మ తలపై జుత్తు, దట్టమైన మేఘాలలాగా, ఒత్తుగా, వెన్నలాగా మెత్తగా వుంది. అమ్మ శిరోజాలు సహజంగానే చక్కటి సువాసనను వెదజల్లు తున్నాయి. ఇంతటి సువాసనలు వెదజల్లే శిరోజాల సంపద, పరమేశ్వరికి యముని యొక్క తేజము నుండి వచ్చింది.
ఇలా నల్లటి కారుమబ్బుల సమూహం లాగా, సుతిమెత్తగా వుంటూ, సువాసనలు విరజిమ్ముతున్న అమ్మ కొప్పు చూడగానే, చంపక, అశోక, పున్నాగ, సౌగంధిక పుష్పాలు అమ్మ జడకొప్పు లో చేరి మురిసిపోయి, ఆ శిరోజాల సువాసనల వలన, తాము కూడా లాభము పొంది, మంచి సువాసనలు వెదజల్లే పూలలాగా మారాలి అనుకుని, అమ్మ కొప్పు లో చేరి మురిసి పోయాయి. ప్రతీ పువ్వుకూ మంచి సువాసన ఎంత సహజంగా వస్తుందో.... అంతకంటే సహజంగా అమ్మ వేణీ సంపదకు సువాసనలు అబ్బి వున్నాయి. ఈ వేణిలో చేరడం వలననే, పూవుల నుండి వచ్చే సుగంధ పరిమళం రెట్టింపు అయ్యింది.
ఈ సృష్టి అంతా జగన్మాత చేత చేయబడినదే కదా. చంపకాశోక పున్నాగ సౌగంధిక మొదలైన పూవులు కూడా ఆ అమ్మ సృష్టి లో భాగమే, కదా. ఈ జగత్తు లో ప్రకాశించే ప్రతీ వస్తువు, జీవి ఎలా అయితే అమ్మ శరీర కాంతివలన ప్రకాశాన్ని పొందుతున్నయో, అలాగే పూవులు కూడా అమ్మ శరీరం నుంచి బయటకు వచ్చే సువాసనలను తాము పొంది, సువాసనా భరితంగా అవుతున్నాయి.
అమ్మ యొక్క కేశములు, నల్ల కలువల సమూహం లాగా, దట్టమైన కాళరాత్రి లాగా, నల్లని మేఘాల వరుస లాగా వుండి, మనలో వున్న అజ్ఞానము అనే చీకటిని పారద్రోలుతున్నాయి.
ప్రధాన రంగులు అయిన ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలము పూవులను ధరించిన కేశసంపదతో వున్న పరమేశ్వరికి నమస్కరించేడప్పుడు ఓం చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచాయై నమః అని అనాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి