వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
15. అష్టమీచంద్ర విభ్రాజ దళికస్థల శోభితా (షోడశాక్షరీ)
16. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా (షోడశాక్షరీ)
పదహారవ నామ మంత్రము -
ఓం ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకాయై నమః
తన చంద్రుని వంటి ముఖముపైన, అమ్మ దిద్దుకున్న "కస్తూరి" తిలకము, చంద్రుని లోని మచ్చ లాగా కనిపిస్తున్నది. అటువంటి "కస్తూరి" తిలకము ధరించిన లలితా పరాభట్టారికకు నమస్కారము.
మృగనాభి - కస్తూరి - మగ కస్తూరి జింక, ఉదరము, పురుషాంగాల మధ్య వున్న ఒక ప్రత్యేకమైన నాడి/గ్రంధి నుండి వెలువడే ఘాటైన వాసన వెదజల్లే ద్రవము - ఇది ఎంతో ప్రసిద్ధి చెందిన పరిమళ గంధంగా ఎన్నబడినది. అత్యంత ఖరీదైన జంతు ఉత్పత్తులలో ఇది ఒకటి.
అష్టమీ చంద్రుని శోభలతో, సౌగంధిక మణులు పొదగబడిన కిరీట కాంతులతో, చంద్రబింబము వంటి అమ్మ ముఖము విరాజిల్లుతోంది. అటువంటి తన ముఖముపై అమ్మ కస్తూరి తిలకము ధరించింది. ఈ కస్తూరి తిలకము పరమేశ్వరి ముఖ శోభను పెంచుతూ, పరిమళ భరితమైన సువాసనలను కూడా వెదజల్లుతోంది.
పాదములనుండీ తల వరకు కుంకుమ పూతతో ఎర్రగా వున్న పరమేశ్వరి, నుదుటిపైన కస్తూరి తిలకము పెట్టుకుని, చేతిలో ధనుర్బాణాలు, పాశము, అంకుశము ధరించి, తన భక్తులను మోహింపజేస్తూ, దుష్టిశిక్షణ చేస్తూ, జగత్తు అంతటినీ రక్షిస్తూ వున్న జగజ్జనని నుదురు/లలాటము అష్టమీ చంద్రుని కళలతో ధగద్ధగాయమానంగా వుంది. పాపటిలో సింధూరాన్ని పెట్టుకోవడం సువాసిని యొక్క లక్షణము.
మన యోగక్షేమాలను చూస్తూ, మనలను రక్షిస్తున్న, పరమేశ్వరికి నమస్కరించేడప్పుడు ఓం ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి