వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
18. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా (షోడశాక్షరీ)
19. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా (షోడశాక్షరీ)
పంతొమ్మిదవ నామ మంత్రము -
ఓం నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితాయై నమః
అపుడప్పడే విరిసిన లేలేత చంపంకపుష్పము (సంపెంగ పువ్వు) వంటి నాసాదండము (ముక్కు) తో శోభలీనుతున్న పరమేశ్వరికి నమస్కారము.
వశిన్యాది వాగ్దేవతలు అమ్మ ముక్కును, అప్పుడే వికసించి, కమ్మటి సువాసనలు వెదజల్లే లేత సంపెంగ పువ్వు తో పోల్చి, అమ్మను "నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా" అని పిలుచుకుని వాళ్ళు ఆనందించి, పరమేశ్వరిని కూడా ఆనందింపజేశారు.
ఇంతకుముందు నామాలలో అమ్మ కనుబొమలను మన్మధుని ఇంటి తోరణాలు గాను, పరమేశ్వరి కన్నులను, ఆమె ముఖ సౌందర్యం అనే సరస్సు లో అటూఇటూ తిరుగుతూ వున్న చేపలుగానూ మనకు చూపించిన వశిన్యాది దేవతలు, ఈ నామములో అమ్మ ముక్కును, అప్పుడే పూచిన రేక సంపెంగ ( సింహాచలం అడవులలో ఎక్కువగా దొరికే, ఎక్కువ పసుపు, ఒకమాదిరి ఎరుపు రంగులో వుంటుంది) పూవులాగా సూటిగా, తిన్నగా, సొంపుగా తీరుగా వున్నది అని చెపుతున్నారు. చేపలవంటి కన్నులు, అందమైన కనుబొమ్మల తో పూర్ణచంద్ర వెలుగులతో వెలిగిపోతున్న అమ్మ ముఖములో, అత్యంత సుందరముగా ముక్కు కూడా అమరింది, కదా!
మనకు బాగా పరిచయం వున్న వారు, "నంది తిమ్మన". ఈయన "ముక్కు తిమ్మన" అయ్యారు. ఎలా? ఎలాగంటే, ఒకనాడు ఒక మంగలి, క్షౌరము చేసాడు తిమ్మన గారికి. ఆ మంగలి పనితనానికి మెచ్చి తిమ్మన గారు కొంత డబ్బు ఇవ్వబోతే, ఆ మంగలి, "నాకు డబ్బు వద్దు. ఒక మంచి పద్యం ఇవ్వండి" అని అడిగాడు. తిమ్మన గారు అతనికి డబ్బు తో బాటు పద్యం కూడా ఇచ్చారు. ఆ పద్యం వలనే "ముక్కు తిమ్మన" అయ్యారు. పద్యం లో ఇలా చెప్పారు. పరమాత్మా, అన్ని పుష్పాలకూ చక్కటి సువాసనలను ఇచ్చావు. అందువల్ల తుమ్మెద వాటిమీద వాలుతోంది. నాకు వాసన లేని కారణంగా తుమ్మెద నా వద్దకు రావట్లేదు. అని చెప్పి తపస్సు చేసింది, సంపెంగ పూవు. ఆ తపస్సు యొక్క వర ప్రభావంతో, స్త్రీల యొక్క "ముక్కు" గా పుట్టింది, సంపెంగ. అప్పటి నుంచి అన్నిపూల వాసనలను చూడసాగింది. ముక్కు కు రెండు వైపులా వున్న కన్నులతో అమ్మ ముక్కు రెక్కలు విచ్చిన "గండు తుమ్మెద" లాగా వుంది. ఇలా అందమైన పద్యం రాసి, అమ్మ ముక్కును సంపెంగ పూవుతో పోల్చాడు కనుక, "ముక్కు తిమ్మన " అయ్యారు, మన నంది తిమ్మన.
పరమేశ్వరికి నమస్కరించేడప్పుడు ఓం నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి