శ్రీమద్భగవద్గీత వ్యాసములు- 4: - పి.విఎల్.సుబ్బారావు -విజయనగరం-9441058797

 అంశమ::"జ్ఞానబోధనలు.

ప్రపన్న పారిజాతాయ తోత్ర వైత్రైక పాణయే/,
జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృత దుహే నమః..
బోధన లేనిదే మనిషి,
 ఏ రంగంలోనూ ప్రగతి సాధించలేడు. 
ఈ విషయాన్ని భగవానుడు అర్జునుడి విషయంలో చేసి, చూపించాడు.
 అర్జునుని  యోధుడిగా సంసిద్ధుడ్ని చేయడానికి,, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి చేయడానికి ,
కర్తవ్య విముఖుడ్ని,
కర్తవ్యోన్ముఖుడ్ని,
చేయడానికి ,
ఆయన చక్కని బోధనలు చేసొడు.
 ఆ బోధనల ఫలితం అర్జునుడ్ని బలోపేతం, చేసింది. వాస్తవాన్ని, ఆకళింపు చేసుకొనేటట్లు, చేసింది.
సంగ్రామంచేయనన్న,
వాడే సంగ్రామ దక్షుడు అయ్యాడు. విజయుడయ్యాడు.
సాధారణ జీవితంలోనైనా, ఆధ్యాత్మిక జీవనం లోనైనా,బోధనలు ఎంతయినా అవసరం
పరమాత్ముడి బోధనలు, కొన్ని తెలుసుకుందాము.,
ప్రపంచంలో ఉన్నవి రెండే.1 సత్(సత్తు)
2 *అసత్ (అసత్తు)
*అసత్తు__అసత్యమైనది-ఉనికియేలేదు.
సత్ అను దానికి లేమి లేదు. ఈ రెండింటి వాస్తవ స్వరూపములు ఎరిగి. మనిషి తత్వము, తెలుసుకోవాలి.
పుట్టిన వానికి మరణము , మరణించిన వానికి, పునర్జన్మ తప్పదు. 
కనుక పరిహరించుటకు సాధ్యము కాని, విషయములయందు, శోకింపకూడదు..
కర్తవ్య కర్మ ఆచరణమునందే నీకు (మనిషికి) అధికారము. దాని ఫలముల యందు లేదు. అట్లని కర్మలను మానుట యందు నీకు ఆసక్తి కూడదు. నీవు అసక్తుడవు కారాదు. అంటే ఫలాపేక్షరహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలా చరింపుము.
మనిషి ముని అంటే స్థితప్రజ్ఞుడవ్వాలి. తద్వారా దుఃఖములకు కుంగిపోనివాడును, సుఖములకు పొంగిపోని వాడును, రాగ,భయ క్రోధములు వీడిన వాడు అవ్వాలి. మనిషి శ్రేష్టుడు కావాలి.! ఎందుకంటే శ్రేష్టుడైన పురుషుని ఆ చరణము (ప్రవర్తన)నే ఇతరులు అనుసరిస్తారు. అతడు ప్రతిష్టించిన ప్రమాణములనే,
 లోకులందరూ, పాటించెదరు.
.
*ఉదా_*శ్రీరాముడు, సత్య హరిశ్చంద్రుడు, గాంధీజీ, 
మనిషి ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో శ్రేష్టుడిగా ఎదగాలి. సమాజానికి( role model )నమూనాగా, ఉండి సూత్రధారి కావాలి.
మనిషి కర్మయోగి,
 ,జ్ఞాన యోగి కావచ్చును. ఏ విధానము( process) ఎంచుకున్నాలక్ష్యం సాధించాలి. ఏ మార్గం ఎంచుకున్నా గమ్యం చేరాలి. నిర్దేశించబడిన చర్య అత్యవసరం. 
మనిషి కర్మయోగి---అతడు కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వానిని అంటవు.
మనిషి సాంఖ్యయోగి--ఇంద్రియములు తమ విషయములయందు వర్తిస్తున్నాయి. తానేమి చేయుట లేదని భావించును. సకల ప్రాణుల యందు ఆత్మ రూపమున ఉన్న నన్ను, (వాసుదేవుని) చూచు పురుషునికి, అట్లే ప్రాణులన్నింటిని నా యందు ఉన్నట్లు చూచువానికి --నేను దృశ్యుడను. అతడు నాకు దృశ్యుడు. అతడు నేను, నేను అతడే.! కాబట్టి మనిషి భగవంతుడిలో అందరినీ, అందరిలో భగవంతుడిని చూడాలి.!
సర్వం విష్ణుమయం జగత్- --ప్రహ్లాదుడు.
హరికాకఅన్యులెవరు-.  అన్నమయ్య
అర్జునుడు పరమాత్ముని--యోగ సాధన చేసేవాడు మధ్యలో మరణించి యోగ భ్రష్టుడైతే వాడి గతి ఏమి? అని అడిగితే 
పరమాత్ముడు ఇలా చెప్పాడు..
1 అట్టి పురుషుడు ఈ లోకమున గాని, పరలోకమున గాని అధోగతి పాలవ్వడు.
ఒక కార్య సాధనలో చివరి క్షణంలో మనసు చెలించి దానిని సాధించలేక పోతే చింతింప అవసరము లేదని నొక్కి వక్కాణిస్తున్నాడు. పరమాత్ముడు. అంతవరకు చేసిన సాధన ఊరికే పోదని ఊరడిస్తున్నాడు.ex
Ex-:-I.A.S .. పరీక్షకు బాగా ప్రయత్నించి ఉత్తీర్ణుడు కానీ వ్యక్తి తరువాతి కాలంలో ఏ ఉద్యోగం చేసినా అతని సాధన ఫలితం అందులో ప్రతిబింబిస్తుంది. 
2.-:-. యోగ భ్రష్టుడు పరలోకమున వెళ్లి అక్కడ గడిపి పవిత్రులైన సంపన్నులైన (శుచీనాం శ్రమతాం) ఇంట జన్మించును.
3:-పుణ్య లోకములకు వెళ్ళకుండానే జ్ఞానులైన యోగుల కుటుంబంలో జన్మించును. మోక్ష ప్రాప్తికి అధికముగా సాధన చేయను. శ్రీమంతుల ఇంటిలో ఉన్నా భగవంతుని వైపు ఆకర్షించబడును. పరమాత్ముడు అర్జునుడ్ని యోగివి కమ్మని బోధిస్తున్నాడు. ఎందుకంటే యోగి--తాపసులకంటే శాస్త్రజ్ఞుల కంటే, సకామ కర్మలు ఆచరించు వారి కంటే శ్రేష్టుడు.
ఇదే ప్రతిపార్థునికి పరమాత్మ బోధన. యోగులందరిలో ,
1. శ్రద్ధాళువు
2. : అంతరాత్మను నాయందే లగ్నమొనర్చినవాడ
3-: నన్ను భజించువాడు, నాకు పరమ ఇష్టుడు అన్నాడు..
అనేక జన్మల పిదపజ్ఞాని యైనవాడు, సర్వము వాసుదేవమయమే అని భావించును. ఉదా---:
ప్రహ్లాదుడు, అన్నమయ్య, తుకారామ్, త్యాగయ్య, మీరాబాయి,
నన్ను సదా భావించును. కానీ అట్టి మహాత్ముడు (భాగవతోత్తముడు) లభించుట అరుదు.
నన్ను శరణు పొంది,
 జరా మరణ విముక్తికై ప్రయత్నించు జీవులు
1.. ఆ పరమాత్మను, 
2'. సంపూర్ణ ఆధ్యాత్మమును
3:-సంపూర్ణ కర్మను అఖిలం కర్మ) తెలిసికొందురు.
మనసును ఎటూ పోనీక నిరంతరం పరమేశ్వర ధ్యాన రూప యోగమునే సాధన చేయు మనుష్యుడు దివ్య పురుషుడైన పరమాత్మని చేరును. 
గమనిక:--
పరమాత్ముడినే కాక ,జీవితంలో అనుకున్న లక్ష్యమును సాధించి భౌతిక ప్రపంచంలో ఆశయసిద్ధి పొందు మార్గము కూడా ఇదే.! యువతకి ఓ లక్ష్యం ఉండాలి. అది తప్పక సాధించాలి. 
ధృఢమతులైన భక్తులు నా నామ గుణములను నిరంతరం వాద్య బృందములో కీర్తింతురు. నన్ను చేరుటకు యత్నింతురు. పదే పదే నాకు నమస్కరింతురు. సర్వదాన ధ్యానమునందే నిమగ్నులయ్యెదరు. అనన్య భక్తితో నన్ను ఉపాసించెదరు.
కాబట్టి ఈ పనిని మనం మందరం చేసి ఆ భక్తుల దారిలోనే నడిచి, దానినే జీవన పరమావధిగా భావిస్తే ఇహ పరాలు రెండు లభిస్తాయి.
జ్ఞాని:--నన్ను యదార్థముగా జన్మ రహితుని గాను, అనాది, ఆదిరహితుడైనను (అన్నింటికీ కారణమైన వానిని అనాది అందురు.)
యైన వానిని గాను, సర్వలోకమహేశ్వరుడు గాను, తెలుసుకున్నవాడు మానవులలో జ్ఞాని. అట్టివాడు సర్వపాపముల నుండి విముక్తుడు. 
లౌకిక
విషయ జ్ఞానము కలిగిన వాడు నిజమైన జ్ఞాని కాదు.
ధర్మాచరణ:-సమాజంలో వ్యక్తుల వర్గీకరణ ఉంటుంది. అది గీతలో ఓ రకంగా ఉంది. ప్రస్తుత సమాజంలో ఈ వర్గీకరణ చూడవచ్చు. 
1 జ్ఞానులు-:(scholars)
2.:(-rulers) పాలకులు,
 3:- వ్యాపారులు (traders).
4:- (servants) సేవకులు.
దీని ప్రకారము ఆ వర్గంలో వారు ధర్మం-- కర్మలను చేయాలి. దీనికే స్వధర్మ, సహజ కర్మ, స్వకర్మ, నియత కర్మ మొదలైన పేర్లు ఉన్నాయి.
పర ధర్మము నందు ఎన్నో గుణములు ఉన్నను, స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను, చక్కగా అనుష్టింపబడు స్వధర్మాచరణమే ఉత్తమం. ఈ స్వధర్మం ఆచరించేమనుష్యునకు ఎట్టి పాపములు ఏమాత్రము అంటనే అంటవు.
ఉదా:-జంతువులను వధించి మాంసము విక్రయించే కసాయికి హింస పాపము అంటదు. 
యుద్ధంలో సైనికుడికి శత్రు సైనికుడ్ని హతమార్చిన, ఆ పాపము అంటదు. 
స్వధర్మాచరణమునందు మరణించుటయు శ్రేయస్కరమే!
పర ధర్మాచరణము భయావహం.
ఉదా:-యుద్ధం చేస్తూ పరాక్రమము చూపించి మరణించిన సైనికుడు వీర స్వర్గము పొందుతాడు. మరణానంతరము,
 అతని అవార్డు ,
అతని భార్య, అందుకుంటుంది. 
గమనించవలసిన విషయము:---పరమేశ్వరుని తన స్వాభావిక కర్మాచరణచే పూజింతు మానవుడు పరమసిద్ధిని పొద్దును. ఎవరు చేసే కర్మ (వారి స్వాభావికకర్మ) వారు చేసే పూజ..
Work is worship(పనే పూజ) 
రామకృష్ణ పరమహంస ఈ సమాజంలో ఉన్న వారందరికి వైద్యులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, వర్తకులు, పురోహితులు, కర్షకులు ,శ్రామికులు, మొదలైన వారు ఈ బోధన వర్తిస్తుంది.. ఇది దృష్టిలో నుంచుకుని సమాజంలో ని ప్రతి ఒక్కరము వారి స్వధర్మాచరణ చేస్తూ వారు తరించడమే కాదు సమాజం శాంతి సౌఖ్యాలతో ఉండడానికి కారకులు అవుతారు. ప్రేరకులు అవుతారు కూడా!.
ఈ భగవద్గీత జ్ఞాన బోధ మార్గం జీవన సాఫల్యం
_______
ఈ క్రింది అధ్యాయములలోని శ్లోకముల భావము పైన వ్రాయబడినది. 
2--16,17,27,47,56..
3:--21,:'
5:--4,7,8.
6:--30,40నుండి47వరకు.7:--3,7,19,29.
8:--8.
9:--14.10:--3,31,35.
18:--46,47..
_______

కామెంట్‌లు