శ్రీమద్భగవద్గీత-వ్యాసములు --5.: - పి.విఎల్.సుబ్బారావు-విజయనగరం.-94 41058797

 అంశము--:సూచనలు ---సులోచనాలు
 శ్రద్ధావాన్ లభతే జ్ఞానం
త త్పరః సం "యతేంద్రియః,
జ్ఞానం లబ్థ్వా పరామ్ శాంతిమ్ అచిరేణాధి గచ్ఛతి.':
కాళ్ళులక్ష్యం వైపు నడవాలంటే,, కళ్ళు ఎంతో చక్కగా పనిచేయాలి. కళ్ళు నెత్తిమీదికి వెళ్ళకూడదు. కాళ్ళు భూమి మీదకి దిగిపోకూడదు. కళ్ళు, కాళ్ళ మధ్య సమన్వయం (coordination) మనిషి ప్రయాణంలో లక్ష్యం చేరుకునే టట్లు చేస్తాయి. క్రింద ఉన్న కాళ్ళు తక్కువ, పైన ఉన్న కళ్ళు ఏమి ఎక్కువ కావు. ఇది మనిషి తెలుసుకోవాలి. 
అలాగే ప్రగతి పథంలో నడిచేటప్పుడు అనుకున్నది సాధించాలంటే మన హితం కోరే పెద్దల, అనుభవజ్ఞుల సూచనలు మనకు చక్కని సులోచనాలవుతాయి. పరమాత్ముడు అలాంటి సూచనలు ఇచ్చి సవ్యసాచిని మేటి వీరుడిగా నిలబెట్టాడు. 
ఆ సూచనలు మనమూ విందాం. ఆధ్యాత్మిక ప్రపంచంలోనే కాదు ఆధునిక ప్రపంచంలో కూడా ముందడుగు వేద్దాం. 
ఓ అర్జునా! రణరంగమున మరణించిన నీకు వీర స్వర్గము ప్రాప్తించును. యుద్ధమును జయించినచో రాజ్య భోగములు అనుభవించెదవు. కనుక కృత నిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము. 
ఎవరైనా దీనిని వారి జీవితాల్లో ఎదురైన సంఘటనలకు అనువర్తింప చేయాలి. పూర్వాపరాలు చర్చించుకుని సరైన నిర్ణయము చేసుకొని ముందుకు వెళ్లాలి. నిర్ణయమేదైనా అది  సమస్యా పరిష్కార దిశగా, ఉభయతారకంగా ఉండాలి. అంతేగాని కష్టమొచ్చినప్పుడు చింతిస్తూ కూర్చుంటే ప్రయోజనముం డదు. చింత పోవాలంటే సూచనలు పాటిస్తూ నిర్ణయం తీసుకోవాలి, అమలు పరచాలి, అనుకున్నది సాధించాలి. 
విషయ చింతన--: విషయాశక్తి,--కోరికలు--
అది తీరకుంటే క్రోధము,-వ్యామోహము,--స్మృతి భ్రంశము,-బుద్ధి నాశము,--పతనం. కాబట్టి విషయ చింతన చివరికి పతనంగా పరిణమిస్తుంది.
పతనం జరిగిన తర్వాత విచారించే కంటే ఆ పరిస్థితి రాకుండా చూసుకోవడం విజ్ఞత. 
విద్యార్థి పరీక్ష తప్పినప్పుడు విచారిస్తూ కూర్చోవడం తగదు. ఏడాది మొదటి నుండి శ్రద్ధతో చదువుతూ, గురువులు ,తల్లిదండ్రులు, ఇతర పెద్దలు ఇచ్చిన సూచనలు పాటిస్తే ఉత్తీర్ణుడు అవడం ఖాయం.
సాంఖ్యయోగులకు జ్ఞానము, కర్మయోగులకు కర్మ నిష్ట కలిగిస్తాయి. మనసుతో ఇంద్రియాలు వశపరచుకుని, అనాసక్తుడై ఇంద్రియాల ద్వారా కర్మయోగాచరణము కావించు పురుషుడు శ్రేష్టుడు. జ్ఞానము , కర్మల మేలి కలయిక జీవితానికి సార్ధకత. రౌతు గుర్రానికి కళ్లెం వేసి స్వారీ చేసినప్పుడు అతడు చూపిన మార్గంలో గుర్రం పరిగెడుతుంది. చర్నాకోలతో గుర్రాన్ని అదిలిస్తూ పోతుంటే రౌతు గుర్రం మీద నుండి పడిపోకుండా లక్ష్యం చేరుకుంటాడు.
యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తి పరచెదరు. మరియు దేవతలు మిమ్ములను అనుగ్రహింతురు. మీరు పరస్పరము సంతృప్తిపరచు కొనుచు పరమ శ్రేయస్సు పొందగలరు. ప్రకృతితో సహజీవనము చేసినప్పుడు మనిషికి శ్రేయస్కరమైన జీవితం లభిస్తుంది. ఇదొక చక్రము.
((యజ్ఞము+:---వర్షము+:---అన్నము:-)
ఈ చక్రంముఇలా సాగాలి.! ప్రాణుల న్నియు అన్నము (ఆహారము)నుండి జన్మించును .అన్నోత్పత్తి వర్షము వలన కలుగును. యజ్ఞముల వలన వర్షములు కురియును.
మనిషి ప్రకృతితో మమేకమైతేనే జీవితం భద్రం. నేడు మనిషి ప్రకృతికి దూరంగా పోవడం ,దానిని నాశనం చేయడమో, తనస్వార్థానికి
వాడుకో వడమో చేస్తున్నాడు. ఇది మానుకోవాలి. మనిషి కళ్ళు తెరుచుకోవాల్సిన సమయం ఇది. 
యజ్ఞములు ముఖ్యమైనవి. విహిత కర్మలకు యజ్ఞములు మూలములు. వేదములు విహిత కర్మములకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవి. అని మనం తెలుసుకోవాలి. 
కాబట్టి పరమాత్మ యజ్ఞముల యందే తాను ఉన్నానని మనం తెలిసికోవాలని సూచిస్తున్నాడు. జనకుడు మొదలగు జ్ఞానులు ఆసక్తి రహితంగా కర్మలను ఆచరించుట వలన పరమసిద్ధిని పొందిరి.
మనిషి లోకహితార్ధమై కర్మలను ఆచరించాలన్నది ఉత్తమోత్తమైన సూచన. 
సర్వేజనా సుఖినోభవన్తు! సమస్త లోకాని సుఖినోభవన్తు.!
(అన్ని లోకము లుబాగుండాలి. జనులందరూ బాగుండాలి. సర్వ జీవులు బాగుండాలి.) ఇదే పరమాశయము. ఈ సూచన అనుసరించాలి. శాంతి స్థాపించాలి.
స్థూల శరీరము కంటే ఇంద్రియాలు  సూక్ష్మములు,
బలీయాలు, శ్రేష్టాలు. ఇంద్రియములకంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే శ్రేష్టం ఆత్మ. ఇది తెలుసుకుని ఓ అర్జునా! బుద్ధి ద్వారా మనస్సు వశపరచుకుని దుర్జయమైన కామమును నిర్మూలింపుము.
మనలోని "దైవత్వం" తెలుసుకుంటే మన
మేదైనా సాధించగలము. అర్జునా! ఒకవేళ నీవు మహా పాపివి అయినా, తత్వజ్ఞాన నౌక సహాయంతో పాప సముద్రమునుండి నిస్సందేహముగా పూర్తిగా బయట పడతావు. కష్టంలో బయటపడే సూచన ఇది. సరైననౌక ఉంటే సముద్రం నుంచి అయినా బయటపడగలం. 
ప్రజ్వలించుచున్న అగ్ని సమిధలను భస్మం చేసినట్లు తత్వజ్ఞానాగ్ని కర్మల న్నింటిని భస్మము చేయును. ప్రపంచమున జ్ఞానముతో సమానమగు పవిత్రమైనది మరియొకటిలేనే లేదు. ప్రపంచంలో భౌతిక జీవనంలోనైనా, ఆధ్యాత్మిక జీవనంలోనైనా జ్ఞానమే ముఖ్యం. అందుకే జ్ఞానమే సామర్థ్యం.( Knowledge is Power) అనే నానుడి వాడుకలో ఉన్నది. 
శుద్ధ అంతఃకరణములు గల సాధకుడు బహు కాలము వరకు కర్మయోగాచరణము చేసి ఆత్మయందు అదే జ్ఞానము తనంతటతాను పొందగలడు.
కర్మాచరణము జ్ఞానముగా ప్రతిష్టింపబడాలన్న సూచన మనకు అత్యవసరం. 
మనిషి ఏ రంగంలో ఉన్న అది ఆధునిక భౌతికశాస్త్రమైనా (modern physics), ఆధ్యాత్మిక రంగమైనా(,, spiritual world) నిలబడాలంటే సంబంధిత జ్ఞానము నిత్యం సంపాదిస్తూ, ఆ సంపాదనలో శిఖరాగ్రం చేరుకోవాలి. అప్పుడే వ్యక్తిగత ప్రగతి, సామాజిక అభ్యున్నతి సాధ్యము. సంస్థలు, వ్యక్తులు తెలుసుకొని జ్ఞానాభివృద్ధి దిశగా జీవితం సాగించాలి. అర్జునా! సంశయము గలవాడు భ్రష్టుడై నశించును. అనుమానం పెనుభూతం అను నానుడి మనకు తెలుసు. మనిషి తన హృదయం నందు గల అజ్ఞాన జనితమైన ఈ సంశయమును వివేకజ్ఞాన ఖడ్గముతో రూపుమాపి సమత్వరూపకర్మ యోగమునందు స్థితుడై సమస్య సాధనకు సన్నద్ధుడు కావాలి.
సంశయము తొలగడానికి వివేకం అవసరం. వివేకము విజయానికి దారి చూపును. కర్మ సన్యాసము, కర్మయోగము రెండును పరమ కళ్యాణదాయ కాలే. కానీ కర్మయోగము సాధనయందు సుగమము అగుట వలన ఆచరించదగినది. సాంఖ్య, కర్మయోగాలు వేర్వేరు ఫలములు ఇచ్చునని మూర్ఖులు పలికెదరు. పండితులు అట్లు పలుకరు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనా బాగా ఆచరించువాడు ఆ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందును. 
భగవతత్త్వమును తెలుసుకునిన భక్తునికి పరమ శాంతి లభించును. కర్తవ్యఫలమును ఆశ్రయింపక కర్తవ్యకర్మను ఆచరించు వాడు నిజమైన సన్యాసి. నిజమైన యోగి. కానీ కేవలము అగ్నికార్యములను త్యజించి నంత మాత్రాన సన్యాసి కాడు. అట్లే కేవలం క్రియలను త్యజించి నంత మాత్రాన యోగియుకాడు. 
మనుజులు ఈ సంసార సాగరము నుండి తమను తామే ఉద్ధరించుకోవలెను. తమకు తామే అధోగతి పాలు కారాదు. ఏలనన లోకములో మనుజులు తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు.
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకూడదు. తనకు తానే భవిష్యత్తు తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నం చేసుకుంటూ పోవాలి. 
ఉదాహరణకు  అనారోగ్యమునకు గురి అయినప్పుడు దాని నివారణ ప్రయత్నం మనిషి ప్రారంభిస్తే ఇతరులు కలిసి వస్తారు. మనసును, ఇంద్రియములతో, శరీరమును, 
జయించిన జీవుడు ,
తనకు తానే మిత్రుడు.
అట్లు జయించలేనివాడు తనకు తానే శత్రువు. జితేంద్రియునకు--మనసు, ఇంద్రియములు, శరీరము ఆధ్యాత్మిక జీవనంలో భగవత్ ప్రాప్తికి, భౌతిక జీవనములో లక్ష్య సిద్ధికి మిత్రుని వలె సహకరిస్తాయి.
జితేంద్రయుడు కాని వానికి అవి శత్రువులై ప్రవర్తించి భౌతిక ప్రపంచంలో లక్ష్యసాధనకు అవరోధాలుగా నిలుస్తాయి. ఆధ్యాత్మిక జీవితం సంగతి దేవుడెరుగు?  
సమస్త భూతములకు బీజమును, ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను., తేజోవంతులలో తేజస్సును నేనే.
(God is everything anything).
భక్తులు నాలుగు రకములు.
1_-ఆర్తులు:-శారీరక, మానసిక సంతాపములకు గురైన వారు.
2:--అర్థులు:-
శుభకర్మలను
ఆచరించుచు సుఖసంపదలను కోరేవారు. 
3:--జిజ్ఞాసులు:--
ఏ విషయము తెలుసుకోవాలన్నా "జిజ్ఞాస "ముఖ్యం పరమాత్మ విషయములో ఇది అత్యవసరం
4:--జ్ఞానులు:--పరమాత్మ ప్రాప్తి పొందినవారు లౌకిక జ్ఞానము దాటి, జ్ఞానం ద్వారా పరమాత్ముని తెలిసికొన్న వాడిదే నిజమైన జ్ఞానము.
ఈ నలుగురిలో అనన్య భక్తి యుతుడైన జ్ఞాని అత్యుత్తముడు.ఏలనన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను. అతడననాకు మిక్కిలి ఇష్ణుడు. అని తేల్చిచెప్పాడు పరమాత్ముడు.
భక్తుని సమర్పణ::----
పత్రం,, పుష్పం,, ఫలం,, జలం,,,
నిర్మల బుద్ధితో నిష్కామ భావముతో సమర్పించినచో నేను ప్రత్యక్షముగా, స్వయముగా ప్రీతితో స్వీకరింతును, ఆరగింతును..*;
ఓ కౌంతేయ!
నీవు ఆచరించే కర్మను, 
భుజించు ఆహారమును, 
హోమం చేయు హవ్యమును,
అర్పించు దానమును, 
ఆచరించు తపస్సును, 
నాకే సమర్పింపు ము..*
"సర్వం శ్రీకృష్ణా ర్పణమస్తు"అనుకొని జీవితం సాగిస్తే ,ఆయన ఇచ్చిన సూచనలను అనుసరిస్తే ,మానవ జీవితం ఫలవంతం అవడం నిశ్చయం.!
ఈ భగవద్గీత సూచనలు-- సులోచనా లు ద్వారా జీవనం ఫలవంతం అవుతుంది.
_______
ఈ క్రింది అధ్యాయములలోని శ్లోకముల భావము పైన వ్రాయబడినది.
_______
4:--36,37,38,42...
2:--57,62,;
3:---3,7,11,14,15,20,
_30,42,_43:;
5:---2,4,29,;:.
6:---1,5,6,..
7:---10,16,17,
9:---26,27::
_______

కామెంట్‌లు