అంశము__:
ఆదేశాలు-
శిరోధార్యాలు
గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్ర విస్తరైః
*యా స్వయం పద్మనాభ స్య ముఖ పద్మాద్వినిః సృతా"*
పరమాత్ముడు అర్జునునికి ఇచ్చిన ఆదేశాలు అతనికి ఎంతగానో ఉపకరించాయి. ముందుకు నడిపించాయి నిజంగా అతడ్ని రక్షించాయి.
అర్జునా!
పిరికితనమునకులోను కావద్దు. నీకు ఇది ఉచితం కాదు. తుచ్ఛమైన ఈ హృదయ దౌర్భాల్యమును వీడి యుద్ధములకై నడుం బిగించుము.
హృదయ దౌర్భాల్యముంటే దుఃఖం చుట్టుముట్టును ,దాన్ని అధిగమిస్తేనే ధైర్యంగా అడుగేస్తాం. అనుకున్నది సాధిస్తాం.
వివేకానంద స్వామి కూడా మనిషికి హృదయ దౌర్భాల్యం తగదని తెలియజేశారు.
అర్జునా!
శోకింపదగనివా రికొరకై నీవు శోకించుచున్నావు. పైగా పండితుని వలె మాట్లాడుచున్నావు. పండితులైన వారు ప్రాణమును పోయిన వారిని గూర్చి గాని, ప్రాణములు పోని వారిని గురించి గాని శోకింపరు.
మానవుడు జీర్ణవస్త్రములను త్యజంచి, నూతన వస్త్రములు ధరించినట్లు, జీవాత్మ పాత శరీరమును వీడి నూతన శరీరమును పొందును. ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళనీవు భావించినప్పటికి దీనికైనీవు శోకింప దగదు.
క్షత్రియునకు ధర్మ యుద్ధమును మించినట్టి, శ్రేయస్కరమైన కర్తవ్యము మరియొకటి ఏమీయును లేదు. కోరికలన్నింటిని త్యజించి మమతా అహంకార స్పృహ రహితుడై చరించు పురుషుడు శాంతిని పొందును.
నాయందు దోషారోపణ చేయుచు, నా ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయములందును జ్ఞానోపహతులై,భ్రష్టులై కష్టముల పాలగుదురు.
అహంకార కారణమున నా వచనమును పెడచెవిన పెట్టినచో నష్టములపాలగుదువు. అనంతరం పరమార్థ పదము నుండి భ్రష్టుడివి అయ్యెదవు.
తపస్సంపన్నుడు కాని వానికిని,భక్తి రహితునకు, వినాలనికుతూహలం లేని వానికిని, నీవు గీత రూప రహస్యోపదేశము ఎన్నడు తెలుపరాదు. అట్లే నా యందు దోష దృష్టి కలవానికి ఎన్నడు ఈ ఉపదేశము తెలుప రాదు.
భాషణం కూడా అపాత్రం కారాదు . నాస్తి కుడైన వానికిదైవం గురించి తెలుప రాదని మనం గ్రహించాలి.
మనిషికి మాతృ ఆదేశం, పితృ ఆదేశము, గురు ఆదేశము భగవత్ ఆదేశము ఎంతో విలువైనవి. ఆపదలు రాకుండా చూస్తాయి. ఆపదలొస్తే రక్షిస్తాయి. పార్థు న కు భగవంతుడు ఇచ్చిన ఆదేశాలు...
పార్ధు నకు ఇచ్చిన ఆదేశాలు పార్థులమైన మనందరికి శిరోధార్యాలు..!
ఈ క్రింది అధ్యాయములలోని శ్లోకముల భావం పైన వ్రాయబడినది.
2---:3,11,22,26,36,71:
3---:32.:
18__:58,67:.
_______
శ్రీమద్భగవద్గీత వ్యాసములు--6.:- పి.విఎల్ సుబ్బారావు -విజయనగరం-94410 58797
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి