సహాయం : - జె. అశ్విత్,- 7వ తరగతి,- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దోమలపల్లి.-నల్లగొండ మo&జిల్లా
 అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన ఒక ఉడుత నివసించేది. అది చాలా సోమరిపోతు. ఆ ఉడుతకు  ఒక మిత్రుడు ఉండేవాడు. అది ఏనుగు. అవి రెండూ ఎంతో స్నేహంగా ఉండేవి. అవి రెండూ కలిసి ఒకరోజు ఆ దట్టమైన అడవి లోపలికి వెళ్ళాయి. అక్కడ కొన్ని ధాన్యపు గింజలు వాటికి కనిపించాయి. ఉడుత గబాగబా వెళ్లి ఆ ధాన్యం గింజలను తిన్నది. ఏనుగు మాత్రం కొంత ధాన్యాన్ని తిని మరికొంత ధాన్యాన్ని తన తొండంలో పెట్టుకొని తన ఇంటి పెరటిలో చల్లింది. కొద్ది రోజులకు ఆ ధాన్యం గింజలు మొలకెత్తాయి. ఇంకొన్ని రోజులకు ఆ మొలకలు మంచి మొక్కలుగా ఎదిగాయి. వాటిని చూసి ఉడత చాలా ఆశ్చర్యపోయింది.ఒకరోజు ఉడుత వాటిని దొంగిలిద్దామని చూసింది. అది చూసిన ఏనుగు ఇవి నా ఒక్కదానికే కాదు, మన ఇద్దరికీ. మనం ఇద్దరం కలిసి వీటిని తిందాం అని చెప్పింది. దానికి ఉడుత ఎంతో సంతోషించింది. ఆ ధాన్యాన్ని ఉడతా ఏనుగు ఇద్దరు కలిసి తిన్నాయి. 

నీతి : ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండాలి.

కామెంట్‌లు