-టోర్నమెంట్ డైరెక్టర్ మారసాని విజయబాబు
సహచర సమాంతర ఆలోచనల సామాజిక వేదిక, సత్యం చారిటబుల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంద్రా చెస్ అసోసియేషన్ తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ మల్లికార్జున గారి సహకారంతో డిసెంబర్ నెల 7 వ తేదీ పాకాల ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ను నిర్వహించనున్నట్టు టోర్నమెంట్ డైరెక్టర్ మారసాని విజయబాబు తెలిపారు.
దామలచెరువు గ్రామం మంగినాయనపల్లెలో మంగళవారం రాత్రి జరిగిన సహచర సమాంతరంగా ఆలోచనల సామాజిక వేదిక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో మారసాని విజయబాబు మాట్లాడుతూ ఈ పోటీలలో తిరుపతి, చితూరు, అన్నమయ్య, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు సంబంధించిన అన్ని వయసుల క్రీడాకారులు పాల్గొనవచ్చునని చెప్పారు.
ఓపెన్ కేటగిరీలో మొదటి 20 స్థానాలు సాధించిన వారికి ట్రోపీలతో పాటు నగదు బహుమతులు అందించనున్నామని వివరించారు. అలాగే అండర్ 7,9,11,13,15 విభాగాలలో మొదటి ముగ్గురికి ట్రోపీలతో పాటు నగదు బహుమతులు, నాలుగు నుంచి 10 స్థానాల వరకు మెడల్స్ ఇవ్వాలని తీర్మానించామని పేర్కొన్నారు. బెస్ట్ సీనియర్, బెస్ట్ విమెన్ కేటగిరీ లో ప్రధమ స్థానం పొందిన వారికి ట్రోఫీలను బహుకరించనున్నామన్నారు. పోటీలలో పాల్గొన్న క్రీడాకారులందరికీ సర్టిఫికెట్స్ అందించనున్నామని వెల్లడించారు. ఈ పోటీలలో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న క్రీడాకారులు వెంటనే రిజిస్టేషన్ చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 8143337722 నంబర్ ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా క్రీడాకారులు చెస్ బోడ్స్ ఖచ్చితంగా తెచ్చుకోవాలని సూచించారు. ఈ పోటీలు ఉదయం 9 గంటలకు ప్రారంభం అయి సాయంత్రం వరకు మొత్తం 7 రౌండ్స్ ఉంటాయని, మధ్యాహ్నం క్రీడాకారులతో పాటు వారి తల్లిదండ్రులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి