అది గదిగో చెరువురా
మా ఊరి చెరువురా
చుట్టు కట్ట ఉండెరా
ఎంతో చక్కగ ఉండేరా
చెరువు మధ్యలో తూమురా
పొలాలకు నీళ్ళు పంపురా
ఊరికి అందం చెరువురా
చెరువుకు అందం మత్తడిరా
పెద్ద వర్షం కురిసెరా
చెరువు మొత్తం నిండెరా
ఎక్కువైన నీళ్ల తోటి
మత్తడి దుంకు చుండెరా
బెస్తవాళ్లు వచ్చిచిరా
చిన్న చేపలు తెచ్చిరిరా
చెరువులోన వేసిరిరా
చేపలు పెద్దగయ్యెరా
బెస్తవాళ్లు చూచిరిరా
వలలన్ని తెచ్చిరిరా
చెరువులోన వేసిరిరా
చేపలన్ని వలలో చిక్కెరా
బెస్త వాళ్లు పట్టుకొని
అంగడిలో అమ్మిరిరా
లాభాలు వచ్చెరా
రందితీరి పోయెరా
చెరువంటె చెరువురా
తల్లిలాంటి చెరువురా
చెరువులో చెత్తరా
ఎప్పుడు వేయొద్దురా
మా ఊరి చెరువురా
చుట్టు కట్ట ఉండెరా
ఎంతో చక్కగ ఉండేరా
చెరువు మధ్యలో తూమురా
పొలాలకు నీళ్ళు పంపురా
ఊరికి అందం చెరువురా
చెరువుకు అందం మత్తడిరా
పెద్ద వర్షం కురిసెరా
చెరువు మొత్తం నిండెరా
ఎక్కువైన నీళ్ల తోటి
మత్తడి దుంకు చుండెరా
బెస్తవాళ్లు వచ్చిచిరా
చిన్న చేపలు తెచ్చిరిరా
చెరువులోన వేసిరిరా
చేపలు పెద్దగయ్యెరా
బెస్తవాళ్లు చూచిరిరా
వలలన్ని తెచ్చిరిరా
చెరువులోన వేసిరిరా
చేపలన్ని వలలో చిక్కెరా
బెస్త వాళ్లు పట్టుకొని
అంగడిలో అమ్మిరిరా
లాభాలు వచ్చెరా
రందితీరి పోయెరా
చెరువంటె చెరువురా
తల్లిలాంటి చెరువురా
చెరువులో చెత్తరా
ఎప్పుడు వేయొద్దురా

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి