ద్వితీయ బహుమతి విజేత
===================
//పల్లవి//
రండి బాలల్లారా ఎగిరే చిలకల్లారా
రేపటి భవితకు రూపును ఇచ్చే
తెల్లని మనస్సు తేనె పలుకుల్లారా...
భావి భవితకు పునాది వేద్దాం
//రండి బాలల్లారా//
చరణం- 1
అవని మన్ననలు పొందుతూ
ఓ మొక్కను నాటుదాం
స్వచ్ఛత పరిశుభ్రతే ప్రథమ ధ్యేయంగా ఓ సంకల్పం చేద్దాం
//రండి బాలల్లారా//
చరణం -2
అమ్మ మాటగా మాతృ భాషను
కమ్మగా పలుకుదాం
ఐకమత్యమే బలంగా
మరో అంకురార్పణ గావిద్దాం
//రండి బాలల్లారా//
చరణం- 3
ఆప్యాయత అనురాగాల వాడిన వనంలో
ప్రేమ విత్తనాలు నాటి చిరునవ్వులతో
నైతిక విలువల పాఠాన్ని పాడుతూ
చేయి చేయి కలుపుదాం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి