అమ్మ నన్ను భూమ్మీదకు రమ్మంది
ముద్దాడి బంగారు బొమ్మంది
ఏడిస్తే హత్తుకుని ఊరుకొమ్మంది
నాన్నకి చూపించి ఎత్తుకొమ్మంది
చక్కనైనపేరుని నాకిమ్మంది
జోలపాడి బజ్జోమంది
మమ్మ తిందువు గాని రమ్మంది
లాలపోసి దీర్ఘాయువు కమ్మంది
బబ్బతాగించి జీర్ణించుకొమ్మంది
బొమ్మనిచ్చి ఆడుకొమ్మంది
వేలుపట్టుకు నడకనేర్చుకొమ్మంది
నేను కింద పడితే ఏంకాదు లెమ్మంది
పలకిచ్చి అఆలు దిద్దమంది
తప్పు చేస్తే ఒప్పుకొమ్మంది
చదివి యోగ్యురాలివి కమ్మంది
పెద్దల ఎదిరిస్తే బాగుపడవు పొమ్మంది
సోమరితనం పనికిరాదంది
ఎదిగినా ఒదగమనే అంది
కష్టార్జితాన్ని నమ్ముకొమ్మంది
పరుల నష్టపెట్టవద్దంది
శాంతం సహనం తో ఉండమంది
కన్నుమూసేముందు చేయూపి వీడ్కోలు ఇమ్మంది🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి