పాలపిట్టలం :- రవికుమార్ సింగంపల్లి, చెన్నై-ఫోన్: 88256 51377
ఉత్తమ విజేత 
===========
పల్లవి//
రంగు రంగుల చిలకలం 
అలకల కొలుకులం
ఇప్పుడే మొలిచిన మొలకలం 
మేం వచ్చామంటే కలకలం 
మేం ఆడిందే ఆట, మేం పాడిందే పాట
పండగే ప్రతిపూట వసంతమే ప్రతిచోట

చరణం -1
ఊయలెక్కి తాకేస్తాం ఆకాశం అంచుని
ఊహలతో నింపేస్తాం హృదయాల లోతుని
ఆశలతో పట్టేస్తాం మరోప్రపంచపు బాటని
విపంచినై వినిపిస్తాం అనురాగపు పాటని

Ilరంగు రంగుల చిలకలం ll

చరణం - 2
ఏటిగట్టు మీద పాలపిట్టలా
స్వేచ్ఛగా జీవిస్తాం  స్వఛ్చంగ బతికేస్తాం
గొంతు మురళిగ మార్చి తీయగా పాడేస్తాం
కొమ్మరెమ్మల తోటి దోబూచులాడేస్తాం
పూలదారుల్లోన పొలం గట్టు పైన                                   
పరుగులే తీసేస్తాం

Ilరంగు రంగుల చిలకలం ll

చరణం- 3
నీలాకాశమె మాకు ముద్దు
వాలే పొద్దు మా ఆటలకు హద్దు 
ఈ సంతోషం దేవుడిచ్చిన వరమా 
అదే మాకు సగం బలమా
రేపు కోసం దాచుకోమూ
పక్కవానిని దోచుకోమూ
కమ్యూనిజం మానైజమా
సామ్యవాదం మావైనమా

Ilరంగు రంగుల చిలకలం ll

కామెంట్‌లు