శ్రీమద్భగవద్గీత వ్యాసములు--,9.: - పి.విఎల్. సుబ్బారావు.-.విజయనగరం-9441058797

 అంశము--
విశ్వకర్త -విశ్వరూప సాక్షాత్కారం
భాగము -1

(భగవంతుని వీడియో)*
1.అనేక వక్త్రనయినమ్, అనేకాద్భుత దర్శనమ్!
అనేకాది దివ్యా భరణం దివ్యానే కోద్యతా యుధమ్!*
2.* దివ్య మాల్యాంబరధరం దివ్య గంధాను లేపనమ్!
సర్వాశ్చర్యమయం దేవమ్, అనంతం విశ్వతో ముఖమ్*
అర్జునుడు శ్రీకృష్ణునితో--: ఓపురుషోత్తమా!
జ్ఞాన ,ఐశ్వర్య ,శక్తి, బలవీర్య, తేజోమహితమైన నీ షద్గుణైశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షముగా చూచుటకు కుతూహలం పడుచుచున్నను, నీ దివ్య రూపం ను చూచుటకు నన్ను అర్హునిగా భావించినచో శాశ్వతమైన నీ దివ్య రూపం నాకు చూపింపుము అని ప్రార్థించెను.
అనుగ్రహించిన పరమాత్ముడు అర్జునునితో ప్రాకృత (కర్మ) చక్షువులతో నా రూపమును నీవు నిజంగా చూడలేవు. కనుక నీకు దివ్యదృష్టిని ప్రసాదించుచున్నాను. దానితో నాఈశ్వరీయ యోగశక్తిని చూడమని తెలిపెను.
అంత సంజయుడు దృతరాష్ట్రునితో--- ఓ రాజా!
మహాయోగేశ్వరుడు, పాపములను హరించువాడు
అయిన భగవానుడు ఆ విధముగా పలికి అర్జునునకు విశ్వరూపము చూపెను. ఈ విశ్వరూప సందర్శన యోగం "వీడియో అర్జునుడు సందర్శించిన పరమ విరాట్ స్వరూపం.
1.ముఖములు అనంతములు, నేత్రములు అసంఖ్యాకములు, అందలి దృశ్యములు అద్భుతములు, ఆ రూపం అనేక దివ్యాభరణ శోభితం. ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రములు చేపట్టి ఉండెను. దివ్యమైన వస్త్రములు ధరించి యుండెను. ఆ దివ్య శరీరం నుండి దివ్య చందన పరిమళములు దశ దిశలకు గుబాళించుచుండెను. ఆ రూపము సర్వాశ్చర్యకరం, అనంతం, సర్వతో ముఖం!
2. ఆకాశమున వేల కొలది  సూర్యులు ఒక్కుమ్మడిగా ఉదయించినచో వచ్చు కాంతిపుంజములు ఆ విరాట్ రూప తేజస్సు కి సాటి రావు.
3. ఆ సమయము నఅర్జునుడు ఆ దేవదేవుని శరీరము నందు అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములను వేర్వేరుగా ఒకే చోట కేంద్రీకృతమై యునట్లు చూసెను.
4. అద్భుతమైన ఆ విశ్వరూపాన్ని చూచి అర్జునుడు ఆశ్చర్య చకితుడైపు లకిత గాత్రుడయ్యెను. ఆ రూపానికి భక్తిశ్రద్ధలతో సాష్టాంగ ప్రణామములు ఆచరించెను. తదనంతరము చేతులు జోడించి ఇట్లనెను.
5. ఓదేవాది దేవా! 
నీ విరాట్ రూపం నందు సకల దేవతలను, నానావిధ ప్రాణికోటిని, కమలాసనుడైనబ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను, దివ్య సర్పములను చూచుచున్నాను.
6. ఓ విశ్వేశ్వరా! విశ్వరూపా! నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు, అసంఖ్యాకములు, నీ అనంత రూపము సర్వతోముఖముగా విలసిల్లుచున్నది. నీవు ఆది మధ్యాంతరహితుడవు. మహత్త్వపూర్ణమైన నీ దివ్య రూపమునకు ఆది మధ్యాంతములను తెలిసికొనలేకున్నాను. 
7. హే విష్ణో! కిరీటమును, గదను, చక్రమును ధరించి, అంతట ను తేజః పుంజములను విరిజిమ్ముచున్న నిన్ను దర్శిం చుచున్నాను. ప్రజ్వాలితాగ్నివలెను, జ్యోతిర్మయుడైన సూర్యుని వలెనువెలు గొందుచున్న నీ అప్రమేయ రూపము దుర్నిరీక్షమై యున్నది.
8. పరమ అక్షర స్వరూపుడైన పరబ్రహ్మ, పరమాత్మవు నీవే కనుక అందరికిని తెలిసికొనదగిన వాడవు. ఈ జగత్తు నకు నీవే పరమాశ్రయుడవు. సనాతన ధర్మ రక్షకుడవు. నీవు అవ్యయుడవు. సనాతన పురుషుడవు అని నా విశ్వాసము.
9. ఓ మహాత్మా! 
దివినుండి భువి వరకు గల అంతరిక్షమునందు అంతటా అన్ని దిశలలోను నీవే పరిపూర్ణుడవై యున్నావు. అద్భుతమైన నీ భయంకర రూపం ను చూచి ముల్లోకములు గడగడలాడుచున్నవి. ఇదిగో !ఆ దేవతలెల్లరు నీలో ప్రవేశించుచున్నారు. కొందరు భయపడిన వారై అంజలి ఘటించి నీ నామ గుణములను కీర్తించుచున్నారు. మహర్షులు, సిద్ధులు స్వస్తి వచనములతో, ఉత్తమో త్తమ స్తోత్రములతో నిన్ను ప్రస్తుతించుచున్నారు.
10. ఏకాదశరుద్రులును. ,         
ద్వాదశాదిత్యులును, అష్ట వసువులును, సాధ్యులు ను, విశ్వదేవతలును, అశ్విని కుమారులును, మరుద్గణములును, పితరులును అట్లే గంధర్వ యక్షాసురసిద్ధ సముదాయములును సంభ్రమాశ్చర్యములతో నిన్నే దర్శించుచున్నారు. 
11. హే మహా బహో!
అసంఖ్యాకములైన వక్త్రములను, నేత్రములను చేతులను, ఊరువులను పాదములను, ఉదరములను కోరలను కలిగిన మిక్కిలి భయంకరమైననీ రూపము నుచూచి అందరును భయకం పితులగుచున్నారు. నేను కూడా భయముతో వణికిపోవుచున్నాను.
ఏలననహే విష్ణో!
నీ రూపం అంతరిక్షమును తాకుచున్నది. అది అనేక వర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను విరిజిమ్ముచున్న విశాల నేత్రములతో, విస్తరించిన ముఖములతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపం ను చూచి న నా మనస్సు తత్తర పడుచున్నది. అందువలన నా ధైర్యము సడలినది. శాంతి దూరమైనది.
12. ఓ జగన్నివాసా!
కరాళదంష్ట్రాలతో. (భయంకరమైన కోరలతో), ఒప్పుచున్న నీ ముఖములు ప్రళయాగ్ని జ్వాలలవలె భీతి గొల్పుచున్నవి. వాటిని చూచిననాకు దిక్కు తోచకున్నది. శాంతి (నెమ్మది )పొందలేకున్నాను. ఓ దేవేశా! ప్రసన్నుడవు కమ్ము. అనుగ్రహింపుము. అని అర్జునుడు భగవానుని ప్రార్థించెను ( వేడుకొనెను).
శ్రీమద్భగవద్గీత వ్యాసములు 9 లోని ఒకటవ భాగము విశ్వరూప సాక్షాత్కారము వ్రాయబడినది.
_______ 11వఅధ్యాయము.ఈ క్రింది శ్లోకములలోని భావము వ్రాయబడినది.
11---::3:4:5:6:7:8:9:10; to 25వరకు.
_______
కామెంట్‌లు