శ్రీమద్భగవద్గీత వ్యాసములు -9:- పి.విఎల్. సుబ్బారావు- *విజయనగరం-9441058797

 భాగము -3
అంశము --- విశ్వకర్త-విశ్వరూప సాక్షాత్కారం

అనన్యా శ్చింత యంతోమాంయేజనాః పర్యుపాసతే,
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం!!
అర్జునుడు శాంతిని పొంది ధైర్యము కలవాడై భగవానునితో ఈ విధముగా పలికెను.---:
ఓ జనార్ధనా!
మీ అతి సౌమ్యమైన మానవాకృతిని(శ్యామ సుందర రూపమును) చూచి ఇప్పుడు నా మనస్సు కుదుటపడినది. నేను నా స్వాభావిక (సహజ) స్థితిని పొందితిని.
భగవానుడు పలికెను
నీవు చూచిన నాఈ చతుర్భుజరూపము యొక్క దర్శన భాగ్యము అన్యులకు అత్యంతదుర్లభము. దేవతలు సైతము ఈ రూపము నుదర్శించుటకై సదా ఉవ్విళ్ళూరుచుందురు.
ఓపరంతపా, అర్జునా! ఇట్టినా చతుర్భుజ రూపము నుప్రత్యక్షముగా చూచుటకును, తత్వ జ్ఞానమును పొందుటకును, అందుఏకీ భావ స్థితినందుటకును, కేవలము అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యమగును. అప్పుడు 
అనన్యా శ్చింత  యంతో మాం యేజనాః పర్యుపాసతే! తేషాం నిత్యాభియుక్తనాం యోగక్షేమం  వహామ్యహం!
అన్న పరమాత్ముడి మాట రూఢి అవుతుంది. అలాగే ఆదిశంకరుల మాట 
మోక్ష సామగ్రియాం భక్తి రేవ గరీయసి
విదితమవుతుంది. కాబట్టి భక్తితో కూడిన సాధన పరమాత్ముని దర్శింప చేస్తుంది అనేది నిశ్చితము. అంతేకాక భగవానుడు సూచిస్తున్నాడు--:
అర్జునా! కర్తవ్య కర్మలను అన్నింటిని నాకే అర్పించువాడు మత్పరాయణుడు, నా యందు భక్తిశ్రద్ధలు గలవాడు, ప్రాపంచిక విషయములయందు ఆసక్తి లేనివాడు, ఏ ప్రాణి యందు ఏమాత్రం వైరభావము లేనివాడు అయిన అనన్య ( పరమ) భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు."";
ఈ విధముగా భగవంతుని అనుగ్రహము వలన దైవ దర్శనము పొందిన పార్థుని మనఃస్థితి మనకు తేట తెల్లం అవుతుంది. సాధకునికి పరాకాష్ట(ectasy)ఏదో ఇందులో లభిస్తుంది. ఆ తన్మయత్వంలో కొంత పునురుక్తి కూడా కనిపిస్తుంది. అయితే అది ఆ సందర్భానికి ఉచితమే! విశ్వరూప సందర్శన యోగం లభించిన అర్జునుడు మనకు సజీవ ఉదాహరణ. సాధారణ కన్నుకు అది సాధ్యం కాదు. అందుకే పరమాత్ముడు అతనికి దివ్య దృష్టి అనుగ్రహించాడు, 
సూర్యుణ్ణి మామూలు నేత్రాలతో చూడలేము. ఒక గాజు ముక్కకిమసి పూసి లేదా నల్ల గాజు ముక్క సాయంతో చూస్తున్నాము. అలాగే భక్తుడు సాధనతో ఎదిగి మానవ సాధారణ దృష్టి (normal human vision) నుండి దైవదృష్టి(divine vision) సాధించుకుని, భగవంతుని దర్శన అనుభూతి పొందడం, జీవితానికి సార్ధకత చేకూరుస్తుంది. 
అర్జునుడి నుండి భగవంతుని దర్శించాలన్న
*తపన*మనకు కలగాలి. అయితే వీక్షించడం అంత సులువు కాదనే విషయం అర్జునుని మాటల్లో స్పష్టం అవుతుంది. భగవత్ దర్శనంలో
భయం కూడా అతను అనుభవించాడు. అందుకు భీకరాకృతి విడిచి ప్రసన్న ఆకృతి తో దర్శనమివ్వమని వేడుకున్నాడు. విరాట్ రూపం విశ్వరూపం కన్నా ప్రసన్నమైన చతుర్భుజాకృతి దర్శనం ఆయన కాంక్షించాడు. సాధారణమైన బల్బు వెలుగు మనం చూడగలం కాని ఓ"10000'"వాట్,ల బల్బు వెలుగుతుంటే చూడడం మన తరమా?
ఈ అధ్యాయం అధ్యయనం వల్ల లభించే భగవత్.దర్శన ఆనందం వర్ణనాతీతం అన్నది నిర్వివాదాంశం"!
_______
శ్రీమద్భగవద్గీతలోని వ్యాసములు 9 . 3వ భాగముతో పూర్తి అయినది
_______
11వ అధ్యాయములోని 50నుండి55 శ్లోకముల భావము తో ఆచరించవలసిన వివరణ తెలియజేయడమైనది.
_______
కామెంట్‌లు