ఉచితాలు :- డి.వినాయక్ రావు, భైంసా, 9059494259
 సీ:ఉచితాలు పంచగన్ నూరంత నురికేరు 
వస్తువుల్ యేవైన వదలకుండ 
నుచిత పథకమన్న నుత్సాహమొందేరు 
సేవలు యేవైన సేకరించ 

నుచితాలు యిచ్చేటి నుత్తముల్ నాశించు
ప్రతిఫలంబును చూడ పట్టుబడదు 
నలమట లేకుండ నాశించు సంపద 
తట్టంబు దెచ్చును తప్పకుండ
తేగి: ప్రతి ఫలంబును నాశించి పనులు జేయు 
దాత లుందురు ధరణిలో  తనకలిడను 
మోసమెరుగుతూ నడుచుట ముదమునిచ్చు 
నుచితపథకముల్ యేవైన నొప్పదంటు
a
కామెంట్‌లు