చరవాణి మహత్వము :- డి.వినాయక్ రావు, భైంసా, 9059494259
 చరవాణి లేకుండ జనపదులుండరు 
క్షణమైన దినమందు సంతసముగ
యూట్యూబు సంగతుల్ యుక్తంబు ననుకుంటు 
కన్నార్పకుండవిన్ కాంచుచుండ్రు 

జనకుడు జననియు సంతానమంతయున్
మౌనిగా మారేరు మాటలేక 
పనులన్ని మరిచేరు పనిముచ్చు లయ్యేరు 
మతిలేక మెదిలేరు స్మృతిని మరచి 
తేగీ: ప్రేమ లేకుండ జేసేను వెఱ్ఱి ఫోను 
బంధముల్ చెర్చి మనుషులన్ బంది జేయు 
గంటమునుమార్చు పనిలేక శుంఠగాను 
మనిషి స్మృతినంత తొలగించు మాయలాడి
కామెంట్‌లు