సర్పంచుల ఎన్నికలు:- డి.వినాయిక్ రావు, భైంసా, 9440749686
యెన్నికలివి సర్పంచుల
యెన్నెన్నో చిత్ర కృతులు యెర్గింపవియున్ 
మన్నన ప్రజలది నొందన్
పన్నాగము పన్నుచుంద్రు పదవొందుటకై

ఓటుకు రేటును కట్టుట
చేటును కొనితెచ్చుటగును చేతనుడెరుగన్ 
వోటును కొన్నట్టయ్యా 
బాటగు న్యాయాన్ని విడిచి ప్రతిక్రియ నెంచున్

ప్రజల స్వామమున్న పరిపాలనంటుగన్ 
యెన్నికల్లు వచ్చు యేలుబడికి 
యేలికైన వాడు యేతరి నయ్యెనా 
వెతల నిచ్చి ప్రజల వేపు చుండు


కామెంట్‌లు