నా పంచపదుల సంఖ్య---
1647-1648.
1647.
అనాదిగా భగవద్గీత, ఆధ్యాత్మిక జ్ఞాన సంహిత!
వ్యాస విరచిత గీత, మానవజాతి జ్ఞానప్రదాత!
ధర్మసంస్థాపనకై దైవావతారం, తధ్యమన్న వ్రాత!
దైవభక్తి విశ్వాసం ఆస్తికత్వ, పరిపుష్టి సంధాత!
సద్గుణ,నిర్గుణ ,
దైవ ప్రతిష్టాపన నిర్దేశకత, పివిఎల్!
1648.
అష్టాదశ అధ్యాయాలు,
ఏడు వందల శ్లోక సమేత!
గీతా శ్లోకమొక్కటి చాలు, మారుతుంది నీ తలరాత!
ఫలాపేక్ష రహిత కర్మాచరణే, మోక్షాన చేయూత!
ధర్మమే దైవం, దైవమే ధర్మం, దైవం ధర్మ ఫలదాత!
గీత శ్రవణం, పఠనం ,మననం, మనశ్శాంతి సంభాత, పివిఎల్!
________
గీత బహుమతి.మతితో చదివితే సద్గతి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి