1.
రైతు పంట నల్ల రేగడి నేల, తెల్ల బంగారం పత్తి!
వత్తిగా ప్రమిద నూనె తడిసి, వెలిగిస్తే వెలుగే దైవం ముందు!
నేసి వస్త్రంగా ధరిస్తే చూసే ,
వాళ్ళందరి కన్నులకు విందు!
జాతీయోద్యమాన స్వదేశీ, వస్త్రధారణ బహు పసందు!
మాన్ చెస్టర్ నూలు మిల్లులన్నీ
రాట్నం ధర్మమా.అని బంద్!
2.
ఏడు గజాల చీర అగ్గిపెట్టె, ఒదిగే అది నైపుణ్యం గుట్టు!
దుస్తులన్నీ తీసి కట్టు ,పడతికి, నేత చీర కట్టే మరి ఆకట్టు!
చేనేత భారతీయం, విశ్వమంతా ఒకే దృష్టి పెట్టు!
ఆకర్షణ ద్విగుణీకృతమై ,
ఎక్కు మెట్టుకి పై మెట్టు!
ఈ వస్త్రాలే శస్త్రాలై విదేశీ, మారక ద్రవ్యం పై గురి పెట్టు!
3.
ఫ్యాషన్ ప్రపంచాన సైతం, చేనేతకే పేషన్ ఆధిక్యత!
అనాదిగా సాంప్రదాయం, సంస్కృతి మేటి కలనేత!
వస్త్రం ధరిస్తే పలకరిస్తుంది, రైతు హృదయం ఆత్మీయత!
అంకితమైన వారికే ఇవ్వాలి, మనం చేయూత, అదే విజ్ఞత!
కుటుంబాల వారసత్వం, కొనసాగితే అదే సానుకూలత!
4.
గ్రామాల వ్యవసాయానంతరం,
చేనేతకే ప్రాధాన్యం!
మగ్గాల అనన్య చేతి వృత్తి,
ఫలితమే చేనేత వస్త్రం!
తరతరాలుగా బతుకుతున్న, కుటుంబాల ప్రాతినిధ్యం!
మగ్గాల పెరిగే ఉత్పత్తులు, మరి ఆర్జించు ఆదాయం!
చేనేత కార్మిక సంక్షేమం, ప్రజాస్వామ్య ఆశయం!
5.
చేనేత వస్త్రధారణ,
ఓ ఉద్యమం !
పిల్లా పెద్ద ధరిస్తే ,
అది మహోధృతం !
ప్రభుత్వం ,ప్రజలు ,
కావాలి ఏకీకృతం !
వస్త్రాలకు మార్కెటింగ్ .
సౌకర్యం సౌభాగ్యం!
నేతల కర్తవ్యం,
చేనేత పునరుజ్జీవనం!
_________
\

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి