బాలానందం! బ్రహ్మానందం!:- డా పివిఎల్ సుబ్బారావు. విజయనగరం. 9441058797.
 1.
దివినుండి దిగిన తారలు!
నింగికి ఎగిరే ,పాలపిట్టలు! 
తనివి తీరని తేనెల తేటలు!
ఆరని వెలిగే మణిదీపాలు !
వాడని సుమాల పరిమళాలు!
2.
పిల్లలు ఉన్న చోట,
         ఆనందం సయ్యాట!
 
పిల్లలు పాడితే,
      మనసుకెంతో ఊరట! 
పిల్లలతో బాబాయే
         ఆడాడు గోలీలాట!
 పిల్లలు తోడుంటే ,
       బతుకే పూల బాట !
పిల్లలంటే ఎగిసి పడే ,
     గోదారి అలలే అఃటా!
3.
పిల్లల ఆలాపన,
           పిల్లనగ్రోవి గీతిక!
వారి బుంగమూతి,
     బాలకృష్ణ భలే అందుకే!
చిన్నారి అడుగులు ,
        వనమయూరి నడక!
అభినయీస్తే కళ్ళెదుట ,
               నవరస వేదిక!
కల్లా కపటం లేని వారు,
            మంచికే ఓ ప్రతీక!
4.
బాలలే నిర్మిస్తారు భవిత! 
వారేగా సాధిస్తారు నవత!
ఎదిగి వారే రేపటి యువత! 
యువతే తెస్తారు ఘనత! 
అదే, మానవ జీవన సార్ధకత!
5.
బాలలే ప్రగతి రథసారథులు! 
ఆరోగ్యం అపరధన్వంతరులు!
చదువు భువి బృహస్పతులు!
పదవుల సదా నీతిమంతులు!
ముద్దులొలికి బాలలే,
      మనకి రేపటి పొద్దులు!
_________

కామెంట్‌లు