నా పంచపదుల సంఖ్య---1566--1568.1566.అతడి గళం,అతడి గీతం ,తరతరాల పాఠశాల!హృదయం ,గాన సరస్వతి నర్తనశాల!పసిడి పాటల,నాణాలకు ట్రంకసాల!దైవలీల, ఉన్నది ,ఒక్కడే ఘంటసాల,పివిఎల్!1567.ఎత్తుకుంటే పల్లవి ,గీతానికి శ్రీకారం!చరణం సాగితే ,పాటకి ప్రాణం ప్రాకారం!ఆ నోట విరహమే,మధురాతి మధురం!గీత శ్లోకాలు,ఇల జనాల అమరం!ఈధర గాన ,యశోఆధారం ,ఆ ఆధరం, పివిఎల్!1568.పాడుతుంటే హృద్యం ,పద్యం వీనుల వింజామరం!మరి పఠిస్తే దైవస్తోత్రం, దైవసాక్షాత్కారం!నీలి మేఘం గాలి కెరటంలా, గాన విహారం!జాలువారే గానం ,సరస్వతి పాద మంజీరం!నేలపై ఆ గానతేజం ,సామవేద సాకారం, పివిఎల్!_________
అమృత గానం! ఆనంద సోపానం!:- డా పివిఎల్ సుబ్బారావు,,-9441058797..
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి