ఓ పవిత్ర కాగితమా..
రంగుల కరెన్సీ రూపమా..
వారసుల వీలునామా పత్రమా..
అందరి ఆశల జీవితమా..
పేదోడి ప్రాణామా..
పెద్దోడి పైత్యమా..
లేనోడి జీవమా..
ఉన్నోడి పోత్రమా..
అందరి ఆత్రమా..
చదువుకు మూలము..
పుస్తకాలలో పుటము..
దేవుని చిత్రపటము...
పిల్లలు ఎగురవేసే పతంగివు..
వాననీటిలో వదిలే పడవవు..
కాపీగావచ్చే అచ్చు కాగితమువు..
రాసి వాడేసిన రద్దువు..
పొట్లాల్ని కట్టే చిత్తువు..
పొయ్యి ఎత్తురించే అట్టవు.
గాలికై విసిరే వింజామరవు..
నువ్వు అందరికీ సమ్మతమే..
నిన్నెలా వాడినా ప్రయోజనమే..
ముమ్మాటికీ నువ్వు జనహితమే..

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి