నా కనులకు నీవు నచ్చావు
నీకోసమే నేను ఇక వచ్చాను
అంతట వెతికా ఎక్కడ లేవు
మరి నీవిక ఏమైపోయావు ?
చెప్పకుండా చేయకుండా వెళ్ళావే
తప్పకుండా నాకై నీవిక ఉండాలే
నీవు లేని ఈ జీవితం ఇక దండుగ
నీవుంటేనే కదా మనకిక పండుగ !
నువ్వు నవ్వితే రాలును నవరత్నాలు
ఏరుటకై నే చేస్తాలే పలుయత్నాలు
నీ నవ్వులో పడిపోవునులే పగడాలు
ఇద్దరి మధ్య ఇక ఉండవులే జగడాలు !
నీవు లేక ఇల్లంతా చిన్నబోయి ఉన్నది
నీ రాకకై ఒళ్లంతా కళ్ళు చేసుకున్నది
ఎందుకు వేశావు నీవు నాకు ఈ శిక్ష
ముందుకు నే పోలేక ఏమిటి ఈ పరీక్ష !
ఇంట్లో దీపాలు వెలిగించే వారే లేరు
కంట్లో కనుపాపై కరుణించే తీరు వేరు
నీవు లేక బతుకంతా ఆయనగా శూన్యం
నీవు వస్తేనే తొలగిపోవు నా మదిలో దైన్యం!
తప్పకుండా నీవిక వస్తే నిన్నేలుకుంటా
నీ వెంటే నేనిక ఎల్లవేళలా తోడుంటా
మన కాపురానికి ఇక ఏ ముప్పే రాదంట !
నీ పిలుపే నాకిక వినబడదాయే
నీ రూపం నాకిక కనబడదాయే
ఓ సఖీ ప్రియమైన నా చంద్రముఖి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి