ఓ మా నేస్తమా!:- గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977 కల్వకుర్తి
రాగమా అనురాగమా
మోహమా నా స్నేహమా
ఓ నేస్తమా తెలుపుమా
సూత్రధారివై మా ప్రేమను
నిలుపుమా నీవే కలుపుమా!

అందమా మకరందమా
చందమా నా డెందమా
పాలు నీళ్ళై ఉందామా
విడిపోని ఓ బంధమా
కలిసిపోయే సంబంధమా
తెలుగు నీవే ఓ నేస్తమా !

బంధమా అనుబంధమా
గంధమా ఓ సిరిగంధమా
అందమా అరవిందమా
తెలుపుమా ఓ నేస్తమా
చేయూత నిచ్చే హస్తమా !

కన్నులా కాముని గన్నులా
మెరుపులా మేని విరుపులా
తలుపులా తొలి వలపులా
ఇక తెలుపుమా ఓ నేస్తమా
మా ప్రేమలో మేం చిగురిస్తమా !

కోపమా  ప్రకోపమా
శాంతమా ప్రశాంతమా
భాషణా  సంభాషణా
తెలుపుమా ఓ నేస్తమా
నిలుపుకో నీ అస్తమా !


కామెంట్‌లు