తట్టమీదనే తట్ట
తలపై పెట్టుకొని
బుట్టమీదనే బుట్ట
భుజంపై పెట్టుకొని
ఊరి చెరువు కట్టమీద
నే ఒంటరిగా పోతుంటే
ఓ తుంటరోడు వస్తాడే
తుమ్మెదా ఓ తుమ్మెదా !
వాని తూపులు చూపులు
ఓ సూదంటిరాయి కోపులు
నే తట్టుకొని ఉండగలనా ?
నేటి ఈనాటి రేపు మాపులు
ఇంక నిదురన్నది లేనెలేదులే
నా కంటికి ఈ వంటికి తుమ్మెదా
ఓ తుమ్మెదా ఎలా వేగేది తుమ్మెద!
రోజు రోజు వస్తుంటడు
మోజు తీర్చమంటుంటడు
ముద్దులెన్నో పెడుతుంటడు
సుద్దులెన్నో చెపుతుంటడు
పైట గుంజుతూనే ఉంటడు
పై పైన పడుతూనే ఉంటడు
ఎంత చెప్పినా వినడే పోరడు
కొంతైనా వాడింకా మారడు
తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత
తులువోడే వీడు ఓ తుమ్మెదా !
ఎమరు పాటున వస్తుంటడు
ఏమి ఎరగ తా నంటుంటడు
నా నడుం పైన చేయి వేస్తడు
రెండు కనులు తనుమూస్తాడు
తను నా బుగ్గలన్నీ కొరికేస్తడు
తాను తనువంత మురిపిస్తడుబ
తుమ్మెదా ఓ నా తుమ్మెదా
ఎలా వాన్ని నేనింకా నమ్మేదా
ప్రేమ బుట్టలోన వాన్ని కమ్మెదా
బూరెల్లా ఉన్నవి బుగ్గలంటడు
కొరుకు తినాలని కోరుతుంటడు
ఏమి పోరాడమ్మా వీడు చూడు
ఇంకెన్నడు వీడు మారుతాడు
దొండ పండు లాంటి ఎర్రటి
పెదవులు నావని అంటాడు
దోచుకొని దాచుకొని తాను
జుర్రుకుంటనంటడు ఎంత
ఆగమన్నా ఆగడు ఈ పోరడు
వీడి ఆశ దోశ అప్పడం బారెడు
తుమ్మెదా ఓ నా తుమ్మెదా ఎలా
వీన్ని ఇంకా హద్దులోన ఉంచదా
తుమ్మెదా నీవైనా చెప్పవే తుమ్మెద
వీడెంత మొండి వాడే ఓ తుమ్మెద
రాత్రి పగలు గిల్లుతూనే ఉంటడు
నా యదా తుమ్మెదా ఓ తుమ్మెదా

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి