హరి ఓం హరి:- గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977±కల్వకుర్తి
హరి ఓం హరి హరి
హరి పైనే మా గురి
మా భక్త బృందమూ
సరుగున మీ కడ చేరి
భక్తితో పూజను కోరి
పాలు పండ్లు పసుపు 
కుంకుమలే తెచ్చారు
జే గంటను కొడుతూ
జై జై అంటూ వచ్చారు !

భువనంలో ప్రాకారపు
కోటను వారు కట్టారు
ఈ భవనంలో పూజకు
శ్రీకారం పేరును చుట్టారు 
ఇహము పరము వదిలి
నీవే దిక్కని వారిక కదిలి
అర్చన చేయగా వచ్చారు
నీ మూర్తిని వారు మెచ్చారు !

భక్తులందరికి వరముల నిచ్చుతూ
భక్తగణంబుల బాధలు తీర్చుతూ
కొలువైనావా మా కోవెల యందు
ఇవ్వక రావా శ్రీహరి వరాల బిందు!

శ్రీ లక్ష్మీ సతి నీకు నీవే పతివి మాకు
హరివక్ష వాసి ఆ మహాలక్ష్మి
జ్ఞాన లక్ష్మి జయలక్ష్మి ధన ధాన్య
 ధైర్యలక్ష్మి సాహేతుడవైన నీవు
వెంటనే రావయ్యా ఓ మా శ్రీ హరి
 మోక్ష మందియ్యవయ్యా మాకు మరి


కామెంట్‌లు