మానవుడు చేయకూడని ధర్మాలు:- గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977 కల్వకుర్తి

 1). నీళ్లు త్రాగే జంతువులని, పాలు తాగుతున్న దూడను అదిలించరాదు.
2). గుమ్మడికాయను స్త్రీ ఎలా పగలగొట్టకూడదో, అలానే పురుషుడు దీపాన్ని ఆర్పకూడదు.
3). మొలతాడు లేకుండా మగవాడు ఎట్టి స్థితిలోనూ ఉండరాదు.
4). చతుర్దశి నాడు క్షీరమూ, అమావాస్యనాడు సంసార సుఖాన్ని గూర్చి మర్చిపోవాలి
5). భోజనం చేస్తున్న భార్యనూ, ఆవలిస్తున్న భార్యనూ, తుమ్ముతున్న భార్యనూ చూడరాదు. అలా చూడాల్సి వస్తే వెంటనే పక్కకు తిరగాలి.
6). తలకు, శరీరానికి నూనె రాసుకుని మలమూత్రాలు విడువరాదు.
7). తన నీడను తానే నీటిలో చూసుకొనుట, రాత్రిపూట చెట్ల ఆకులను కోయుట, బావిలో నీరును తోడుట చేయరాదు.
8). ఉదయించే, అస్తమించే సూర్యుడిని నీళ్లలోనూ, అద్దంలోనూ చూడరాదు.
9). స్త్రీలను కాటుక పెట్టుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు చూడరాదు.
10). భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నదీస్నానమూ, సముద్ర స్నానమూ చేయరాదు. అలాగే క్షౌరమూ, పర్వతారోహణమూ చేయరాదు.
11) పరిగెత్తే వారికి, ఆవులించే వారికి, తల స్నానం చేస్తున్న వారికి నమస్కరించరాదు.
కామెంట్‌లు