గాంధీ గాంధీ ఓ మా అందరి గాంధీ
మేము మెచ్చిన మా మహాత్మా గాంధీ
ఇంకా అంతా మెచ్చిన నచ్చిన మా సుందర నందన కరంచంద్ శ్రీ గాంధీ !
పరతంత్ర దాస్యమును అవలోకించి
స్వతంత్ర అవశ్యమును నీ వాలోచించి
సమర శంఖమునే పూరించావు
స్వాతంత్ర సమరమునే సాధించావు !
అహింసయే మన ఆయుధమన్నావు
ఆ ఆంగ్లేయులనే నువు ఢీకొన్నావు
నీ దెబ్బకు కుక్కిన పెనుల్లా మారి వారు చచ్చిన పీనుగులై మిగిలారు
ఆ ఆంగ్లేయులను అవలీలగా జయించి
నువ్వు వెనువెంటనే స్వాతంత్రాన్ని సాధించి
మా అందించావు నీవు మహాత్మా
నిను విడిచి ఉండదులే మా ఆత్మ !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి