కురిసేను జాన
నాతలపుల లోన
దాగింది నీవే నా ?
వయ్యారి జానా
తయారై నే రానా
ఇస్తావా ఓ ముద్దు
వస్తాను ఈ పొద్దు !
నీ ముద్దుతోపాటు
నా ముద్దుకు చోటు
నీ విస్తేనే నే వస్తాను
నిన్నే నే ప్రేమిస్తాను !
చెప్పవే ఓ నాచెలి
ఏది నీ బిగి కౌగిలి
అదేలే నా లోగిలి
నువ్వేలే నా జాబిలి !
మరి వస్తావా ఓ నా చెలి
చేరి అందిస్తావా నీ కౌగిలి
పంచుకుందాం ఆనందం
పెంచుకుందాం అనుబంధం !
అందించు నీ వయ్యారం వగలు
అందిస్తాను నా సెగలు పొగలు
ఒకటవుదాం ఇక రేయి పగలు
ఔదాం ఇక మనం ఆలుమగలు !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి