సింహాదేకం బకాదేకం షట్శున స్త్రీణి గర్దభాత్
వాయసాత్పంచ శిక్షేచ్చత్వారి కుక్కుటాత్.
తా---సింహము నుంచి ఒక విషయాన్ని, కొంగ నుంచి రెండు విషయాలను, కుక్క నుంచి ఆరు విషయాలను, గాడిద నుంచి మూడు విషయాలను, కాకి నుంచి ఐదు విషయాలను, కోడి నుంచి నాలుగు విషయాలను మనిషి నేర్చుకోవాలి. మృగాలను వేటాడేటప్పుడు సింహం తన సర్వశక్తులను ఉపయోగిస్తుంది.
కొంగ తన ఆహారాన్ని దేశ వాతావరణ ప్రకారం గాను, కాలానుగుణంగాను తీసుకుంటుంది. మనిషి కూడా కార్యాన్ని అలానే చేయాలి.
అలాగే కుక్క తనకు అవసరమైనంత ఆహారాన్ని భుజించుట భుజించుట, అల్ప సంతోషం, చక్కటి నిద్ర, తగు సమయానికి నిద్రలేచుట, నమ్మిన బంటుగా ఉండుట, పరాక్రమాన్ని కలిగి ఉండడం చేస్తుంది. ఈ ఆరు గుణాలను కుక్కనుండి నేర్చుకోవాలి.
అలాగే గాడిద మోయలేని బరువును కూడా మోస్తుంది. వాతావరణాన్ని లెక్క చేయకపోవడం, బాగా పనిచేసి అలసి సొలసి సుఖంగా ఉండటం. ఈ మూడు గుణాలను గాడిద నుండి మనిషి నేర్చుకోవాలి.
కాకి నుంచి హద్దు గల శృంగారము, కాఠిన్యము, ఇల్లు నిర్మించుకొనుటలో తగు జాగ్రత్త, సోమరితనాన్ని లేకుండా చూచుకొనుట ఇట్టివి నేర్చుకోవాలి.
ఇంకా కోడి నుంచి మనిషి నేర్చుకోవాల్సింది, పోరాటంలో వెనకకు తగ్గకపోవడం, ఉదయాన్నే నిద్ర లేవడం, బంధువులతో భుజించడము, ఆపదలందు స్త్రీలను రక్షించుకోవడం ఇటువంటివి కోడి నుండి మనిషి నేర్చుకోవాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి