మా విశ్వ విజయశాంతి:- గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977 కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ
శాంతి శాంతి ఓం శాంతి
క్రాంతి క్రాంతి మా విక్రాంతి
మా విశ్వజనుల సంక్రాంతి
గైకొన్నావా నీవిక విశ్రాంతి !

శాంతి శాంతి మా ప్రజల ప్రశాంతి
పల్లెల ముల్లెల మా సజల స్రవంతి
మా జనజీవన వాదన శ్రీ వేదాంతి
చిన్నబోయే నీవు లేక విశ్వభవంతి!

ఎక్కడికి వెళ్లావు ఓ మా చల్లని తల్లి
కనబడకుండా ఉన్నావు నీవు మళ్ళి
మొదలాయెనుగా ఇక్కడ అక్కడ లొల్లి
పాకి పోయెనుగా అవి ఇక గల్లి గల్లి 

ఇక్కడ అక్కడ అనకుండా 
ఎవరేమి చెప్పినా వినకుండా
ఇల సృష్టిస్తున్నారులే గొడవలు
రాజకీయ అరాచక బడవలు !

ఆ గొడవల కుంపట్లో ఇక అజ్యం
 పోస్తూ చేస్తున్నారు వారు రాజ్యం
కుప్పకూలిపోయను ఇక వాణిజ్యం
కష్టనష్టాల్లో చిక్కుకొనే సామ్రాజ్యం!

అఘాయిత్యాలు ఎన్నో విజృంభించే
అరాచకాల అంగడిని అవి ప్రారంభించే
ఇక న్యాయం ధర్మం ఇల అంతరించే
అన్యాయం ఆకాశమంత ఎదిగి అఘోరించే!

ఈ అఘాయిత్యాల అనచివేయ రావమ్మా
ఆ అరాచకాలను రూపుమాపాలిక నీవమ్మా
అమ్మా తల్లి ఓమా విశ్వ విజయశాంతి
నెలకొల్పాలిక ఇలలోన నీవే శాంతి ప్రశాంతి !


కామెంట్‌లు